సులవాయి గ్రామానికి సమయానికి బస్సు నడపాలి
1 min read

హొళగుంద న్యూస్ నేడు : సులవాయి విద్యార్థి బస్సు కోసం పడిగాపులు సులవాయి గ్రాము సమయానికి బస్ నడపాలని బస్సు విద్యార్థులు విద్యార్థి సంఘం నాయకులు గ్రామవాసూలు బస్ ను అడ్డుకున్నారు సిఐటియు మండల కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ సులవాయి పెద్దహేట మూగమనగుంది సమతగేరి దాదాపు 100 మంది విద్య కోసం హెుళగుందకు వస్తున్నటువంటి బస్సులను పాఠశాల కళాశాల సమయానికి అనుకూలంగా నడపాలని విద్యార్థులు కోరారు. తాము ప్రతిరోజు పాఠశాల కళాశాలకు వస్తున్నప్పటికీ బస్సుల ఆలస్యంతో తమకు ఆబ్సెంట్ పడుతుందని ఇదేవిధంగా ఆబ్సెంట్ పడితే హాజరు తక్కువ ఉందని హాల్ టికెట్లు ఇవ్వక పరీక్షలకు కూడా కూర్చోబెట్టరని విద్యార్థులు తెలిపారు.సాయంత్ర సమయంలో కూడా ఇంటికి వెళ్లేసరికి రాత్రి 7 ఐతుందని విద్యార్థులు తెలియజేసారు పోయాయని ఆర్టీసీ అధికారులను అడిగితే రోడ్లు బాగా లేకపోతే మేమేం చేయాలని మీ ఊరికి త్వరలోనే సర్వీసులను నిలిపివేస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు. బస్సును అడిగితే రోడ్ల గురించి చెబుతున్నారని ప్రభుత్వం రోడ్లు వేయకపోతే తామేం చేయాలని ప్రశ్నించారు. తమకు పాఠశాల కళాశాల సమయానికి అనుకూలంగా బస్సులు, హొళగుందకు సర్వీస్ లు నడపాలని కోరారు. ఇంతకుముందే అడిగినప్పటికీ అధికారుల నుండి స్పందన లేదని ఇదే జరిగితే పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సులవాయ్ ముగుమానేగుంది విద్యార్థులు గ్రామ ప్రజలు విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.

