బాలల సంక్షేమ సమితి కార్యకలాపాలపై అధికారులతో సమీక్ష
1 min read

సంక్షేమ సమితి ప్రతి మూడు నెలలకు ఒకసారి నివేదిక సమర్పించాలి
జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు: జిల్లా బాలల సంక్షేమ సమితి కార్యకలాపాలను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఇంతవరకు సిడబ్ల్యుసి ఏలూరు వారి ముందు హాజరు పరిచిన పిల్లల వివరములు వారి ప్రస్తుత పరిస్థితి వారి యొక్క కేసు వివరములు అన్నింటితో కూడిన సమగ్ర నివేదికను అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.జిల్లా బాలల సంక్షేమ సమితి కి సంబంధించి ప్రతీ మూడు నెలలకు ఒకసారి వారి కార్యకలాపాలపై నివేదిక సమర్పించాలని, బాలల సంక్షేమ సమితి లోని బాలల సంరక్షణకు తీసుకుంటున్న చర్యల వివరాలను తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటివరకు సదరు సిడబ్ల్యుసి ఏలూరు వారి ముందు హాజరు పరిచిన పిల్లల వివరములు వారు ఒక ప్రస్తుత పరిస్థితి వారి యొక్క కేసు వివరములు అన్నింటితో కూడిన సమగ్ర నివేదికను అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సి డబ్ల్యూ సి చైర్పర్సన్ పుచ్చల వెంకటేశ్వరరావు, ఐసిడిఎస్ పీడీ శారద, బాలల సంక్షేమ సమితి సభ్యులు హైమావతి రాజేశ్వరరావు సిబ్బంది లక్ష్మి, జ్యోతి, జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సి.హెచ్ సూర్యచక్రవేణి, తదితరులు పాల్గొన్నారు.


