NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతులకు అండగా వైయస్సార్  కాంగ్రెస్ పార్టీ

1 min read

ఆలూరు న్యూస్ నేడు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలూరు వైయస్సార్సీపి ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  మరియు పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగటి శ్రీ దేవి  ఆధ్వర్యంలోపత్తికొండలో దద్దరిలిన అన్నదాత పోరు కార్యక్రమం ముందుగా అంబేద్కర్ సర్కిల్ నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు భారీగా ర్యాలీ గా వెళ్లి  ఆర్డిఓ కి రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై, మరి ముఖ్యంగా యూరియా దొరక్క  వారు పడుతున్న తీవ్ర ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని వినతిపత్రం ఇచ్చిన ఆలూరు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  మరియు పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగటి శ్రీదేవి . ఆలూరు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  మీడియ సమావేశంలో మాట్లాడుతూ… రైతులకు పంటలను పండించడానికి కూటమి ప్రభుత్వం వచ్చిన  రైతులకు ఒక సంచి కూడా  యూరియా దొరకడం లేదు.. టైం ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర కూడా లేదు. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు  రైతులు యూరియా కోసం ధర్నా చేస్తే  రైతులను అరెస్ట్ చేయండి అని చెప్తున్నాడు, ఇదేం దుర్మార్గమైన పాలన..వైఎస్ఆర్సిపి పార్టీ  రైతుల అండగా ఉంటూ రైతుల సమస్యల పైన ఆర్డీఓ కి వినతి పత్రం ఇవ్వడానికి వస్తే డ్రోన్ తో వీడియోలు తీపిస్తున్నారు..  కూటమి ప్రభుత్వనికి అండగా కేంద్ర ప్రభుత్వం ఉన్నా కూడా రైతులకు యూరియా అందించలేకపోతున్నారు..యూరియా సహా రైతులుకు అవసరమైన ఎరువులును వెంటనే పంపణీ చేయాలి అని డిమాండ్ చేసారు.బ్లాక్ మార్కెట్ ను నియత్రించాలి, ఎరువులు పక్కదోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారుపంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.ఉచిత పంటల భీమాను పునరుదించి అందరకి వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. రైతన్నకు బాసటగా వైయస్సార్సీపీ ఉంటదని చెప్పారు.ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని, రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ఆలూరు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మరియు పత్తికొండ వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు,తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు,వైస్ ఎంపీపీ లు సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్​ అభిమానులు పాల్గొన్నారు.

About Author