NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేశ అంతర్గత భద్రతలో సీఆర్పీఎఫ్‌ సేవలు అమోఘం

1 min read

జవాన్ల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం

కలికిరిలో రూ.26 కోట్లతో నిర్మించిన సీఆర్పీఎఫ్‌ భవనాల ప్రారంభం

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్

మదనపల్లె ఆగస్టు 17, న్యూస్ నేడు ప్రతినిది : దేశ అంతర్గత భద్రతను కాపాడటం లో సీఆర్పీఎఫ్‌ బలగాలు చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్ అన్నారు. సీఆర్పీఎఫ్‌ జవాన్ల వల్లే దేశం సురక్షితం గా ఉందనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందని పేర్కొన్నారు. దేశ భద్రత, సార్వ భౌమత్వ పరిరక్షణ కోసం 24 గంటలూ విధులు నిర్వహి స్తున్న జవాన్ల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.తిరుపతి విమానాశ్ర యానికి చేరుకున్న కేంద్ర మంత్రికి టీటీడీ సభ్యుడు భానుప్రకాశ్‌, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో కలికిరి లోని సీఆర్పీఎఫ్‌ కేంద్రానికి చేరుకున్న కేంద్ర మంత్రి అమర వీరుల స్థూపాన్ని సందర్శించి నివాళులర్పించారు. కలికిరి సీఆర్పీఎఫ్‌ కేంద్రంలో రూ.26 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆఫీసర్స్‌ మెస్‌, సబార్డినేట్‌ ఆఫీసర్స్‌ మెస్‌, రిక్రియేషన్‌ క్లబ్‌, స్టోర్‌ బ్లాక్‌, ట్రేడ్స్‌ మెన్‌ బ్లాక్‌ భవన సముదాయాలను కేంద్ర మంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేశారు.ఈ ఆధునిక మౌలిక వసతులు సీఆర్పీఎఫ్‌ అధికారులు, జవాన్లకు మెరుగైన సౌకర్యాలను అందించడంతో పాటు వారి విధి నిర్వహణ సామర్థ్యాన్ని మరింత పెంచను న్నాయి. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్‌ జవాన్లను ఉద్దేశించి బండి సంజయ్‌ కుమార్ మాట్లాడుతూ కొత్తగా ప్రారంభించిన భవనాలు కేవలం నిర్మాణాలు మాత్రమే కాదని, జవాన్ల సంక్షేమం, సౌకర్యాలు, పనితీరు మెరుగు పర్చాలనే కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు ప్రతీకలని అన్నారు.కఠినమైన విధుల అనంతరం జవాన్లు కొంత సమయం ప్రశాంతంగా గడి పేందుకు రిక్రియేషన్‌ క్లబ్‌ ఉపయోగ పడుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. జవాన్ల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఆటలు, క్రీడలు, వినోద కార్య క్రమాలు నిర్వహిం చేందుకు ఇది దోహదపడుతుందన్నారు.స్టోర్‌, ట్రేడ్స్‌మెన్‌ బ్లాక్‌లు ముఖ్యమైన వస్తువులు,వనరుల ను సురక్షితంగా, క్రమ బద్ధంగా నిర్వహించేందుకు ఉపయోగపడతాయని చెప్పారు. ఆధునిక సౌకర్యాలతో కూడిన ఈ భవనాలు బలగాల కార్యాచరణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం లో, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మార్గదర్శకత్వంలో సీఆర్పీఎఫ్‌ సహా కేంద్ర సాయుధ పోలీసు బలగాల ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని బండి సంజయ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్‌ ఏడీజీ సౌత్‌ జోన్‌ రవిదీప్‌ సింగ్‌ సాహి, ఐజీ దినేష్‌ ప్రతాప్‌ ఉపాధ్యాయ్‌, బ్రిగేడియర్‌ అనుపమ్‌ శర్మ, డీఐ సుభాష్‌ చంద్రశర్మ, చీఫ్‌ ఇంజనీర్‌ సీఎన్‌ సురేష్‌  పాల్గొన్నారు.

About Author