PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కూతురు కులాంతర వివాహం చేసుకుంద‌ని.. తండ్రి ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హైద‌రాబాద్ లో దారుణం జ‌రిగింది. కూతురు కులాంతర వివాహం చేసుకుందన్న బాధతో ఓ తండ్రి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఎస్‌బీఐ రిటైర్డు బ్యాంకు మేనేజర్‌ అనంతచారి వెంకటచారి ఆత్మహత్య చేసుకున్నాడు. మల్కాజిగిరి, గౌతంనగర్‌లోని వెంకటసాయి నిలయం ప్రాంతానికి చెందిన వెంకటచారి కుమార్తె కొంతకాలం క్రితం కులాంతర వివాహం చేసుకుంది. ఆ బాధతో వెంకటచారి మద్యానికి బానిసయ్యాడు. కూతురు గురించి ఆలోచిస్తూ మదనపడేవాడు. శుక్రవారం రాత్రి తన బెడ్‌రూంకు వెళ్ళి పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఎంతకూ తలుపు తీయకపోవడంతో భార్య పద్మావతికి అనుమానమొచ్చింది. పక్కింటి వారి సహాయంతో తలుపు బద్దలు కొట్టి చూడగా వెంకటచారి సీలింగ్‌ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించాడు. కూతురు కులాంతర వివాహం చేసుకుందన్న బాధతోనే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పద్మావతి పేర్కొంది.

                              

About Author