కాంగ్రెస్ కు .. కార్యకర్తలకు సంబంధాలు తెగిపోయాయి !
1 min read

పల్లెవెలుగువెబ్ : కాంగ్రెస్ అధినాయకత్వం పై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హైకమాండ్.. పార్టీ నేతలతో, కార్యకర్తలతో సంబంధాలు కోల్పోయిందని ప్రశాంత్ కిషోర్ అన్నట్లు తెలిసింది. ఈ సంబంధాలను పునరుద్ధరించుకుంటేనే పార్టీ తిరిగి బలోపేతమయ్యే అవకాశాలుంటాయని ఆయన చెప్పినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. బీజేపీ నాయకత్వం నిత్యం పార్టీ నేతలతో సంబంధాలు పెట్టుకుంటుందని, తరచూ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ పరిస్థితిని సమీక్షిస్తుందని ప్రశాంత్‌కిషోర్ అన్నట్లు సమాచారం. కానీ, కాంగ్రెస్ లో 70 శాతం జిల్లా అధ్యక్షులతో ఇంతవరకూ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గానీ, రాహుల్ గాంధీ గానీ సమావేశాలు నిర్వహించలేదని పీకే చెప్పారు. ఢిల్లీ స్థాయిలో ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్చార్జి నేతలు కూడా 90 శాతం బ్లాక్ అధ్యక్షులతో సమావేశాలు నిర్వహించలేదని పేర్కొన్నారు.

