మృతుల సంఖ్య 164.. ఆచూకీ లేని వారు 100 మంది !
1 min read
CREATOR: gd-jpeg v1.0 (using IJG JPEG v62), quality = 75
పల్లెవెలుగు వెబ్ : మహారాష్ట్రలో ఇటీవల కురిసిన వర్షాలు మహా విషాధాన్ని నింపాయి. కొండచరియలు విరిగిపడటం, అతి భారీ వర్షాలతో వచ్చిన వరదలు భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. వర్షాల కారణంగా జరిగిన ఘటనల్లో 164 మంది దాక మృతి చెందారు. ఇంకా 100 మంది ఆచూకీ తెలియరాలేదు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 2 లక్షల 29 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పర్యటించారు. బోటులో ప్రయాణించి వరద బాధితుల గోడు విన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.