NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి

1 min read

ఎస్‌డీపీఐ డిమాండ్

హోళగుంద న్యూస్ నేడు: ఆలూరు తాలూకు హోళగుంద మండల ఎస్డిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించాడం జరిగింది ఈ సమావేశంలో ఎస్డిపిఐ ఆలూరు అసెంబ్లీ ఉపాధ్యక్షులు కె సలాం  మాట్లాడుతు రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ ఆలూరు అసెంబ్లీ ఉప అధ్యక్షులు  సలాం  ఆవేదన వ్యక్తం చేశారు. ఇంధన ధరల పెరుగుదలతో ప్రజల జీవన వ్యయం అమాంతం పెరిగిపోయి, ప్రతి కుటుంబంపై ఆర్థిక భారం అధికమైందన్నారు.హోళగుందలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రజలపై మరింత భారంగా మారిందన్నారు. రైతులు వ్యవసాయ పనుల కోసం ఉపయోగించే ట్రాక్టర్లు, మోటార్లు, రవాణా వాహనాల ఖర్చులు భారీగా పెరిగి రైతాంగం తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోందని తెలిపారు. అలాగే ఆటో డ్రైవర్లు, లారీ యజమానులు, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలు పెరిగిన ఇంధన ధరలతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం కేవలం వాహనదారులపైనే కాకుండా అన్ని రంగాలపై పడుతోందన్నారు. రవాణా ఛార్జీలు పెరగడం వల్ల కూరగాయలు, పాలు, నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగి ప్రజల జీవనం కష్టతరమైందన్నారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని ప్రభుత్వం వెంటనే ఇంధన ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై అదనపు పన్నుల భారం మోపకుండా పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న పన్నులను తగ్గించి ధరలను నియంత్రించాలని కోరారు. ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఉపశమన చర్యలు ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. లేకపోతే ప్రజల తరఫున సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి ఎం హఫీజ్, ఉపాధ్యక్షులు కే సలాం, కార్యదర్శి కే అబ్దుల్ రెహమాన్, చికెన్ బక్షి, ఎస్ అస్లం తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *