NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పత్తికొండ ఆర్‌డీఓగా ఓబులేసు బాధ్యతలు

1 min read

ఆర్‌డీఓ ఓబులేసును మర్యాదపూర్వకంగా కలిసిన ఈబీజీ గోవింద్ గౌడ్

శాలువాతో సత్కరించి పూలహారంతో ఆర్‌డీఓకు ఘన సన్మానం

ప్రజలకు పారదర్శక సేవలు

అందించాలని ఆర్‌డీఓను కోరిన టిడిపి నాయకులు

పత్తికొండ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించిన టిడిపి నేతలు

హోళగుందన్యూస్ నేడు : పత్తికొండ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్‌డీఓ)గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఓబులేసును తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఈబీజీ గోవింద్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టిడిపి యువనాయకుడు ఈబీజీ రాజేంద్ర గౌడ్, టిడిపి మండల మైనార్టీ అధ్యక్షుడు ముల్లా మొయిన్ కలిసి ఆర్‌డీఓకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.అనంతరం ఈబీజీ గోవింద్ గౌడ్ శాలువాతో సత్కరించి, పూలహారంతో ఘనంగా సన్మానించారు. నూతన బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, పారదర్శకంగా సేవలు అందించాలని కోరారు. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు, భూ వివాదాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో వేగవంతమైన చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు. పత్తికొండ డివిజన్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం కావాలని, ప్రజల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని ఆకాంక్షించారు.ప్రజలకు నమ్మకాన్ని కలిగించే విధంగా పరిపాలన సాగించాలని, ప్రభుత్వ సేవలు సామాన్య ప్రజలకు సులభంగా అందేలా కృషి చేయాలని టిడిపి నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *