రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై ఆలూరులో వైయస్సార్సీపీ భారీ నిరసన
1 min read
ఆలూరు న్యూస్ నేడు: దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉండటంపై నిరసిస్తూ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కేంద్రంలో వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆధ్వర్యం వహించగా, ఎమ్మెల్యే సోదరుడు బుసినే శ్రీరాములు ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసనలో పాల్గొన్నారు.పెరిగిన ఇంధన ధరల వల్ల సామాన్య ప్రజలు, రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి ప్రజలపై పడుతున్న అదనపు భారం తొలగించాలని డిమాండ్ చేశారు.అనంతరం నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా తహసిల్దార్ కార్యాలయానికి చేరుకుని ఇంధన ధరలు తగ్గించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ రాష్ట్ర మరియు జిల్లా అనుబంధ విభాగాల నాయకులు, మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

