NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వీస్ రోడ్లు సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలి

1 min read

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు వినతిపత్రం

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : గ్రీన్ ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు నిర్మాణం చేయాలని,ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ కు రైతులు వినతిపత్రం అందజేశారు.శనివారం ఏలూరు ఎంపీ కార్యాలయంలో వినతిపత్రం అందజేసి ఎం.పీకి సమస్యలు విన్నవించారు. సర్వేస్ రోడ్లు నిర్మాణం జరగకపోవడం వలన అనేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్, గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ నాయకులు వామిశెట్టి హరిబాబు, దేవరపల్లి సత్యనారాయణ, వందనపు సాయిబాబా, గోలి నర్సిరెడ్డి మాట్లాడారు. ఖమ్మం నుండి దేవరపల్లి వరకు నిర్మాణం చేస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే మన జిల్లాలో చింతలపూడి, టీ నర్సాపురం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల గుండా  నిర్మాణం జరుగుతున్నదని,ఈ మండలాల్లో దాదాపు 31 గ్రామాలు మీదుగా హైవే వెళుతున్నదన్నారు.ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ లేదని, అయితే రోడ్డుకు ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు పెంచుతారని, వాటి బాగోగులకు అటు ఇటు మట్టి రోడ్డు ఉంటుందని, దాన్ని గ్రావెల్ రోడ్డు గా మార్చి రైతులకు ఉపయోగకరంగా తీసుకువస్తామని గతంలో హామీ ఇచ్చారని చెప్పారు. అయితే ప్రస్తుతం మట్టి రోడ్డు కూడా రైతులకు అందుబాటులో లేదన్నారు.సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించకపోవడంతో చాలాచోట్ల రైతుల తమ పొలాలకు వెళ్లే మార్గాలు పూర్తిగా మూసుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వీస్ రోడ్డు మట్టి రోడ్డు కావడంతో ట్రాక్టర్లు లారీలు మట్టిలో కూరుకు పోతున్నాయన్నారు. అన్ని అండర్ పాస్ లను కలుపుతూ సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేశారు.గ్రీన్ ఫీల్డ్ హైవే కు సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించేలా  కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.సానుకూలంగా స్పందించిన ఎంపీసానుకూలంగా స్పందించిన ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ హైవే సర్వీస్ రోడ్ల సమస్యపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని హామీ ఇచ్చారు. హైవే అథారిటీ అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.

About Author