NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

12 శాతం ప్రత్యేక రిజర్వేషన్లు కాపులకు అమలు చేయాలి

1 min read

కాపు తెలగ బలిజ ఒంటరి కులాల వారికి జరుగుతున్న అన్యాయం పై కూటమి ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి –

కాపు రిజర్వేషన్ పోరాట సమితి  కేఆర్ పీఎస్

విజయవాడ, న్యూస్​ నేడు : కాపు తెలగ బలిజ ఒంటరి కులాల వారికి జరుగుతున్నా అన్యాయంపై కూటమి ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని  కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర చైర్మన్ చనమల్ల ప్రసాదరావు శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ  కాపులకు జనాభా ప్రతిపాదికగా 12%  బి.సి.లకు విద్య, ఉద్యోగాలలో 34% రిజర్వేషన్ లు ఓ.సి.లకు EWS 10% రిజర్వేషన్ల కొనసాగించాలని కూటమి ప్రభుత్వం ద్వంద్వ నీతిని ద్వంద్వ వైఖరిని ప్రశ్నిస్తున్నామని ప్రజా ప్రభుత్వం తల్లిదండ్రుల పాత్ర పోషించి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సమధర్మాన్ని సామాజికన్యాయాన్ని పాటించాలని  విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలు అందరికీ సమానంగా కల్పించాలి.  సమాజంలో అందరూ బాగుండాలనీ  అందులో కాపులుకూడా ఉండాలని అన్నారు.బి.సి. మరియు ఇతర ఓ.సి.లకు ఇబ్బంది లేకుండా కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాలవారికి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలోనూ, స్థానిక సంస్థలలోనూ, నామినేటెడ్‌ పోస్టులలోనూ, నామినేటెడ్‌ వర్కులలోనూ జనాభా ప్రాతిపదికగా 12% ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. మా జనాభా ప్రకారం మాకు ఎంతమాత్రం న్యాయం జరగడం లేదు.  జనాభా ప్రాతిపదికగా మా వాటా మాకు ఇవ్వాలి .బి.సి.లకు  జనాభా ప్రాతిపదికగా 34% రిజర్వేషన్లు అమలు చేస్తున్న తరుణంలో 12 శాతం ప్రత్యేక రిజర్వేషన్లు కాపులకు అమలు చేయడానికి గల ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. కుటమి ప్రభుత్వం ద్వంద నీతి విధానాలు  సరికావని కాపులు మినహా ఇతర పేద ఓ.సి.లు బ్రాహ్మణ, క్షత్రియ, ఆర్యవైశ్య, వెలమ, కమ్మ, రెడ్డి తదితరుల లోని పేదలకు ఈ డబ్లూ ఏస్10% రిజర్వేషన్లు కొనసాగించాలని  ఎ.పి.లో జనాభా ప్రాతిపదికగా అందరికీ సమధర్మం, సమన్యాయం, సామాజికన్యాయం జరుగుతుందని ప్రభుత్వం  స్పందించి అందరికీ సమన్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాము  ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్, రాష్ట్ర కో ఆర్డినేటర్  జానపాముల నాగబాబు, రాష్ట్ర కో కన్వీనర్స్ బోడపాటి పెదబాబు, కాకిలేటి హరనాధ్, సోషల్ జస్టిస్ ఫోరమ్ రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ జంగాల సింగరయ్య యాదవ్ ఈ   డబ్లూఎస్ రాష్ట్ర కన్వీనర్  మాదిరెడ్డి వీర రాఘవరావు, వలవల శ్రీధర్ తదితరులు  పాలుగొన్నారు.

About Author