NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కళాకారుల సంస్మరణ సభ…

1 min read

రాష్ట్ర నంది అవార్డు గ్రహీత వన్యం బలరాం, కళా సేవకులు  జె ఎన్ శేషయ్య గారి సంస్మరణ సభ…..

కర్నూలు, న్యూస్​ నేడు: కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం , షఫీ యుల్లా పి హనుమంతరావు చౌదరి,ఆధ్వర్యంలో కర్నూలు నగరం నందలి పింగళి సూరన తెలుగు తోటలో కర్నూలు జిల్లా రంగస్థల కళాకారులు కీర్తిశేషులు నంది అవార్డు గ్రహీత వన్నేం బలరాం, కళా సేవకులు,  జె ఎన్ శేషయ్య  చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సంస్మరణ సభ కార్యక్రమంలో, కళాకారులు కారణజన్ములు, కళాకారులు చిరంజీవులని ప్రశంసించారు. కళాకారులు వన్నెం బలరాం నర నారాయణ పౌరాణిక పద్య నాటకానికి శకుని పాత్రను అద్భుతంగా పోషించి, నాటి చలనచిత్ర నటులు ధూళిపాల శభాష్ అని మెచ్చుకునే తీరు నటించి, రాష్ట్ర నంది అవార్డును పొందినారు. బావ ఎప్పుడు వచ్చితివి సాంఘిక నాటకంలో తనదైన పాత్రలో హాస్య పాత్రను పండించిన ఘనుడు వన్యం బలరామ్. సహజనటులు, దర్శకులు, సహాయ దర్శకులు,గా లలిత కళా సమితి సభ్యులుగా అభినందనలు అందుకున్నారు.కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారుల మధ్య నిర్వహించిన ఈ సంతాప సభలో రంగస్థల కళాకారులు  డి పుల్లయ్య, డిఎన్వి సుబ్బయ్య, లక్ష్మీకాంతం, , షేక్షావలి, ముంతాజ్, గంగాధర్, , మురళి, రమణ చారి, పాల్గొని విజయవంతం  తెలియజేశారు.

About Author