PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆ రాష్ట్రాల్లో కూడ మాంసాహారుల సంఖ్య పెరిగింది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశంలో మాంసాహారుల సంఖ్య పెరుగుతోంది. అధిక శాతం ప్రజలు వారానికి కనీసం ఒకసారి చేపలు, చికెన్, మాంసంలో ఏదో ఒక దానిని కచ్చితంగా ఆరగిస్తున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ సర్వేలో 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న స్త్రీ, పురుషుల నుంచి ఈ వివరాలు సేకరించారు. ఆ సర్వే ప్రకారం దేశంలో శాకాహారుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. శాకాహార పురుషుల సంఖ్య 21.6 శాతం నుంచి 16.6 శాతానికి పడిపోయింది. అంటే మాంసాహారులు 5 శాతం పెరిగారు. మహిళల్లో మాంసాహారుల సంఖ్య స్వల్పంగా 0.6 శాతమే పెరిగింది. మాంసాహారాన్ని వ్యతిరేకించే గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లోనూ మాంసాహార ప్రియులు స్వల్పంగా పెరిగారు.

                                        

About Author