15 రోజుల్లోనే చోరీ కేసును ఛేదించిన పోలీసులు …దొంగ అరెస్టు
1 min read47 తులాల బంగారు ఆభరణాలు , కేజీ వెండి , రూ. 2.50 లక్షల నగదు రికవరీ
డిఎస్పీ ఉపేంద్ర బాబు
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : భారీ దొంగతనం కేసును 15 రోజుల్లోనే పోలీసులు ఛేదించారు. ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడంటారు. ఒకే ఊరు లో ఉండే ఇంట్లో దొంగతనం చేసితప్పించుకోవచ్చు అనుకున్నాడో ఏమో. అయితే మాధవరం పోలీసులు ఇంటి దొంగను పట్టుకుని దొంగలించిన మొత్తం రికవరీ చేసి అరెస్టు చేశారు. బుధవారం ఎమ్మిగనూరు డిఎస్పీ ఉపేంద్ర బాబు విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని రచ్చమర్రి గ్రామానికి చెందిన మురారి శేషాద్రి శెట్టి అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో గత నెల 18వ తేదీన మహారాష్ట్రలోని తీర్థయాత్రలకు వెళ్లారని , తిరిగి వచ్చి చూస్తే ఇంటి తాళం పగల గొట్టి లాకర్ లో ఉన్న బంగారు ఆభరణాలు , వెండి , నగదు దొంగతనం జరిగిందని ఈ నెల 25 తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఫిర్యాదుదారుడు మేరకు కేసు నమోదు చేసుకుని క్లూస్ టీం , డాగ్ స్క్వాడ్ తో దర్యాప్తు చేశామని అందులో భాగంగా అదే గ్రామానికి చెందిన దొండు నాగేంద్ర అనే వ్యక్తి ఈ చోరీకి పాల్పడినట్లు ఆయన తెలిపారు. ముద్దాయి కోసం సిఐ రామాంజులు, ఎస్ఐ విజయ కుమార్ తమ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. మాధవరం రాయచూరు రోడ్డు లోని ఐరన్ బ్రిడ్జి పై ఉన్నాడని సమాచారం రావడంతో దాడి చేసి పట్టుకున్నామని తెలిపారు. అతని వద్ద నుండి దొంగలించిన 47 తులాల బంగారు ఆభరణాలు , ఒక కేజీ వెండి , రూ. 2.50లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకొని , అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు . 15 రోజుల్లో ఈ చోరీ కేసును చేదించిన సిఐ రామానుజులు ,ఎస్సై విజయ్ కుమార్ , మాధవరం పోలీస్ సిబ్బందిని ఎమ్మిగనూరు డి.ఎస్.పి ఉపేంద్ర బాబు అభినందనలు తెలిపారు. తదనంతరం సీఐ రామానుజులు , ఎస్ఐ విజయకుమార్ , హెడ్ కానిస్టేబుల్ వీరేష్ , గురుమూర్తి , వెంకటేశ్వర్లు , కానిస్టేబుల్ వీరాంజనేయులు , వీరేష్ , రఘు , సోమశేఖర్ , రామకృష్ణ , హోంగార్డు వీరేష్ లకు రివార్డు తో అభినందించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది ఉన్నారు.