NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పోలీసులు సేవలు అందించాలి

1 min read

సాంకేతికతను వినియోగించుకుంటూ నిరంతరం నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి

రాష్ర్ట పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టీజీ భరత్ గుప్తా

కర్నూలు,  న్యూస్​ నేడు : పోలీసు శాఖపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేలా పోలీస్ కానిస్టేబుల్స్ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని రాష్ర్ట పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టీజీ భరత్ గుప్తా తెలిపారు.స్థానిక  కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్‌లో 629 మంది ట్రైనీ కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొని,  ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంస పత్రాలను రాష్ర్ట పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టీజీ భరత్ గుప్తా , కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ , జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి , కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ , బెటాలియన్ కమాండెంట్ దీపిక ఎం.పాటిల్  అందచేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  శిక్షణ పొందిన కానిస్టేబుల్స్‌కు అభినందనలు తెలిపారు.. 9 నెలల పాటు శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి పాసింగ్ అవుట్ పరేడ్‌లో క్రమశిక్షణతో, సమన్వయంతో పాల్గొనడం అభినందనీయమన్నారు. ప్రతి అంశాన్ని ఎంతో ప్రణాళికాబద్ధంగా నిర్వహించడం ద్వారా శిక్షణ ఎంత పకడ్బందీగా జరిగిందో స్పష్టమవుతోందని మంత్రి తెలిపారు. 9 నెలల శిక్షణను విజయవంతంగా పూర్తి చేయడంలో తల్లిదండ్రుల సహకారం ఎంతో ముఖ్యమన్నారు. శిక్షణ సమయంలో మార్గనిర్దేశం చేసిన శిక్షకుల పాత్రను అభినందిస్తూ, కానిస్టేబుల్స్‌కు శిక్షణ అందించిన శిక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.పోలీసు శాఖపై ప్రజలకు ఉన్న నమ్మకం ఎప్పటికీ తగ్గకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. అసాంఘిక శక్తులు, రౌడీ మూకలకు పోలీసుల పేరు వింటేనే చట్టంపై భయం కలిగేలా, అదే సమయంలో సాధారణ పౌరులు ప్రశాంతంగా జీవించేలా పోలీసు వ్యవస్థ పనిచేయాలని సూచించారు. పాసింగ్ అవుట్ పరేడ్‌లో అవార్డులు పొందిన వారితో పాటు అవార్డులు పొందని వారు కూడా తమ ప్రతిభను మరింత మెరుగుపరుచుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు.. పాసింగ్ అవుట్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా ఆహ్వానించడం పట్ల గర్వంగా, సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి నాయకత్వంలో క్రమబద్ధమైన నియామక ప్రక్రియను కొనసాగిస్తూ, సాధ్యమైనంత ఎక్కువ మందికి కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు.కార్యక్రమంలో అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా, కర్నూలు APSP 2వ బెటాలియన్ డిఎస్పీ మహబూబ్ బాషా, తదితరులు పాల్గొన్నారు.

About Author