NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్రబాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులను కలసిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు

1 min read

మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిది  : మదనపల్లె పట్టణం లో స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహము నందు రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిటీ సభ్యులు ఉండవల్లి గాంధీ బాబు, చల్ల మధు సూదన రావు లను, మదనపల్లె స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మర్యాద పూర్వ కంగా కలుసు కున్నారు. శనివారం ఈ సందర్భంగా ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ జిల్లా లలితమ్మ బాలలకు సంబంధించిన పలు సమస్యలను కమిటీ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో ముఖ్యం గా పంచాయతీ స్థాయిలో  వివాహాల రిజిస్ట్రేషన్ పటి ష్టంగా జరిగేలా గ్రామ,వార్డు బాలల రక్షణ కమిటీ ల నిర్మాణం, ఆ కమిటీ లు పటిష్టంగా పని చేసేలా, బాలల హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే లైన్ డిపార్ట్మెంట్స్ తో కన్వర్జేన్సీ మీటింగు లు క్రమంగా నిర్వ హించడం తో పాటు  బాలల సమస్యలు పరిష్కారాన్ని కృషి చేయాలని కోరుతూ కమిటీ సభ్యులకు వినతి పత్రం  అంద జేశారు. ఈ కార్య క్రమంలో డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వినోద్ కుమార్,చైతన్య సర్వీస్ సొసైటీ జనరల్ సెక్రటరీ  కవిత రాణి, ఆనందన్, గ్రామ జ్యోతి సొసైటీ సుభద్ర, గుడ్ నైబర్స్ సొసైటీ నాగే శ్వరరావు, ఫోర్డ్ సంస్థ సిబ్బంది పి సి నిర్మల, ప్రభావతి, సుభాషిని, స్వర్ణ కుమారి,నరసింహులు  పాల్గొన్నారు.

About Author