ఏలూరు నియోజకవర్గల లారీ ఓనర్స్ సమస్యల శంఖారావం
1 min read

మా దెందులూరు నియోజకవర్గంలో ఉన్న లారీలకే ప్రాధాన్యత ఇవ్వాలి
మా లారీలు ఖాళీగా ఉండగా పక్క నియోజకవర్గ ఏలూరు లారీలకు సప్లై ఎలా ఇస్తారంటూ సూటి ప్రశ్న
దెందులూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ నిరసన,ఆవేదన
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: మా దెందులూరు నియోజకవర్గంలో ఉన్న లారీ ఓనర్లు డ్రైవర్లు, తమకు రావలసిన లోడులను సైతం, పక్క నియోజకవర్గంలో వారు వచ్చి మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తూ, మాకు ఉపాధి లేకుండా చేస్తున్నారని దెందులూరు నియోజకవర్గం లారీ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణారావు, సెక్రటరీ ఆళ్ల కార్తీక్, లారీ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ శాంతియుతంగా నిరసన తెలిపారు. దెందులూరు నియోజకవర్గంలోని వంగూరు సివిల్ సప్లై గోడౌన్స్ వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టారు. మా దెందులూరు నియోజకవర్గం లోని 200 లారీల ఓనర్లు డ్రైవర్లు ఖాళీగా ఉండగా ఏలూరులో జరిగే లోడులకు మా లారీలను రానివ్వకుండా, మా నియోజకవర్గంలో జరిగే సివిల్ సప్లై గూడెంలో మా లారీలను కాకుండా ఏలూరు లారీలను తీసుకోవడం చాలా దారుణమని, అన్యాయమని ఇలా సివిల్ సప్లై డిఎం నిర్వహించడం చాలా బాధాకరమని మాకు తగు న్యాయం చేయాలని అన్ని అర్హతలతో మాకు దెందులూరు నియోజకవర్గ యూనియన్ సైతం ఉందని మా యూనియన్ లో లారీలు ఉండగా ఏ యూనియన్ లేని పక్కన ఉన్న మరో నియోజకవర్గ లారీలను వంగూరులోని ఎఫ్ సీఐగూడెంలో భీమ్ లోడులకు వారి లారీలను వాడడం ఇటువంటి పరిణామం చాలా దారుణమని దెందులూరు నియోజకవర్గం లారీ ఓనర్ల అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు తక్షణం దీనిపై తగు న్యాయం చేయకపోతే మరింత ఉదృతమైన నిరసన కొనసాగిస్తామంటూ లారీ ఓనర్లు డ్రైవర్లు ఎఫ్ సీ ఐ గోడౌను ముందు డైలీ తిరిగే లారీలో నిలిపివేసి నిరసన తెలిపారు. పలురు ఓనర్లు,డ్రైవర్లు, క్లీనర్లు పాల్గొన్నారు.


