NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్ర ముఖ్యమంత్రి కి హృదయపూర్వక కృతజ్ఞతలు

1 min read

హోళగుంద  న్యూస్ నేడు : ఉరుకుంద లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యునిగా ఎండి హళ్లి గ్రామ సర్పంచ్ సుధాకర్ ని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  తీసుకున్న నిర్ణయంపై ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా యువ నాయకుడు నారా లోకేష్, కర్నూలు పార్లమెంట్ సభ్యుడు బస్తిపాటి నాగరాజు, ఆలూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జ్ వైకుంఠ జ్యోతి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ నియామకం తనపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని, ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు, పారదర్శక పరిపాలన దిశగా కృషి చేస్తానని సుధాకర్  తెలిపారు. ఉరుకుంద లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ప్రాంతీయ ఆధ్యాత్మిక కేంద్రమే కాకుండా వేలాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిందని, ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇవ్వడం హర్షణీయమని పేర్కొన్నారు.ఆలయ పరిసరాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, తాగునీరు–వసతి–పార్కింగ్ సదుపాయాల మెరుగుదల, పండుగల సమయంలో భక్తులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేయడం, ధర్మకార్యాలను విస్తరించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. భక్తుల సూచనలు, సలహాలు స్వీకరించి సమిష్టిగా ఆలయ ప్రతిష్టను మరింత పెంపొందించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ నియామకం ద్వారా ఆలూరు నియోజకవర్గానికి మరింత గౌరవం దక్కిందని, టిడిపి నాయకత్వం స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. పార్టీ శ్రేణులు, గ్రామ ప్రజలు, అభిమానులు అందరూ తనకు అండగా నిలవాలని కోరారు.

About Author