NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతులు సమక్షంలోనే రీసర్వే నిర్వహించాలి

1 min read

రీ-సర్వేతో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం

రాష్ట్ర సర్వే, సెటిల్మెంటు మరియు ల్యాండు రికార్డ్స్ డైరెక్టరు రోణoకి కుర్మనాధ్

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: భూముల్లో నిర్వహిస్తున్న రీసర్వేల్లో రైతులను భాగస్వాములను చేసేలా ముందుగానే సమాచారం అందించి వారి సమక్షంలోనే రీసర్వే నిర్వహించాలని, ఈ కేవైసీ తప్పనిసరిగా నమోదు చెయ్యాలని రాష్ట్ర సర్వే, సెటిల్మెంటు అండ్ లాండు రికార్డ్స్ డైరెక్టరు శ్రీ రోణంకి కూర్మనాథ్ అన్నారు. మంగళవారం  పెదపాడు మండలం తాళ్లముడి గ్రామంలో నిర్వహిస్తున్న రీ-సర్వే కార్యక్రమాన్ని ఆయన జిల్లా రెవిన్యూ, సర్వే అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు సమక్షంలో సర్వే జరగడంతో అయన హర్షం వ్యక్తం చేశారు. రీసర్వేలో తప్పులు పునరావృతం కాకుండా పారదర్శకత ఉండేందుకు రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సర్వే మొదలు పెట్టేరోజున తప్పనిసరిగా సంబంధిత రైతులు లేదా కుటుంబ సభ్యులు క్షేత్ర స్థాయిలో తప్పక ఉండాలని ఉండాలని, సర్వే పూర్తయిన తరువాత డాక్యుమెంటు వెరిఫికేషన్ ద్వారా సరిహద్దులు నిర్ణయం రైతు సమక్షంలోనే నిర్వహించాలన్నారు. రైతులు చేతికి సరైన కొలతలతో కూడిన పట్టాదారు పాసుపుస్తకం అందజేసే వరకూ సమాచారం తప్పనిసరిగా అందించేలా చూడాలని  జిల్లా సర్వే సహాయ సంచాలకులను షేక్ అన్సారీను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రీసర్వేలో తప్పులు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో భూ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు రైతులు సమక్షంలోనే రీసర్వే నిర్వహించే విధంగా రీసర్వే 2.0 నిర్వహిస్తున్నామని అన్నారు. రీసర్వే నిర్వహించిన తరువాత నోటీసు రూపంలో రైతులకు చూపించిన భూహద్దులు ప్రకారం భూవివరాలను తెలియజేయడం, డాక్యుమెంట్లతో సరిపోల్చుకుని నిర్ధారణ చేయడం జరుగుతుందన్నారు. ఈ కేవైసీ చేయించడం ద్వారా రైతులు సమక్షంలో సర్వే నిర్వహించడంతో పాటు రైతులకు అన్ని విధాలా సమాచారం అందిస్తూ ఎక్కడా రైతులు ఇబ్బంది పడకుండా చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న రీసర్వేల్లో ఫేజ్-1లో 628, ఫేజ్-2 లో 748, ఫేజ్-3 లో 729, ఫేజ్-4 లో 1645  గ్రామాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2,800 బృందాలతో అత్యాధునిక రోవర్స్ తో సర్వే నిర్వహించడం జరుగుతున్నదన్నారు. క్షేత్ర స్థాయిలో భూవివరాలు, డాక్యుమెంటు పరంగా గల వివరాలను రైతులు సమక్షంలోనే సరిపోల్చుతూ ఇకముందు ఎటువంటి భూ వివాదాలకు తావులేకుండా రైతులు సంతృప్తి చెందే విధంగా రీసర్వే నిర్వహిస్తున్నామన్నారు. ఫేజ్-5 లో రాష్ట్ర వ్యాప్తంగా 1,343 గ్రామాలలో రైతులతో కలిసిమెలిసి క్షేత్రస్థాయిలో రీసర్వే నిర్వహిస్తున్నామన్నామని, రైతులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలెదురైతే తక్షణ పరిష్కారం చేసే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు ఆయన వివరించారు. ప్రభుత్వ విధానాలు పరంగా 2027 మార్చి నాటికి భూవివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేందుకు తమ అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్వే సహాయ సంచాలకులు  షేక్ అన్సారీ, ఏలూరు డివిజన్ సర్వే ఇన్స్పెక్టర్ కె.యస్.మూర్తి, రీసర్వే డిప్యూటీ తహశీల్దారు కె.దుర్గారావు, మండల సర్వేయరు సాయికృష్ణ, రెవెన్యూ, సర్వే సిబ్బంది, గ్రామ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *