NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అమ్మాయికి సరైన వివాహం వయస్సు 18 సం।।

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  వీకర్ సెక్షన్ కాలనీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాలలో పెళ్లి వయస్సుపై అవగాహనా కార్యక్రమములో జిల్లా రాష్ట్ర బాల స్వస్త్యా కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్.మహేశ్వరప్రసాద్  మాట్లాడుతూ బాధ్యతమైన వైవాహిక జీవితానికి తొలిమెట్టు సరైన వయస్సులో వివాహం  అమ్మాయికి 18 సంవత్సరములు,అబ్బాయికి 21 సంవత్సరములు  నిండనిదే వివాహము చేయరాదని తెలిపారు తెలిసి తెలియని ఆడేపాడే,చదువుకొనే వయస్సులో పెళ్లిళ్లు చేస్తే తల్లి శారీరక,మానసిక అనారోగ్యంతో బాధపడే అవకాశాలు ఉంటాయనిబాల్య వివాహాలవలన అనేక అనర్థాలు కలుగుతాయని, ,చిన్న. వయస్సులో వివాహము చేస్తే గర్భస్రావము , పుట్టబోయే బిడ్డలు చనిపోయి పుట్టడము,తక్కువ బరువుతో జన్మించడం పుట్టాక మరణించడము,రక్తహీనత,గుర్రపువాతము,నెలలు నిండకనే కాన్పులు,తక్కువ బరువు గల బిడ్డ  పుట్టడము ,కష్టమైన కాన్పు  లాంటి సమస్యలు వస్తాయని  తెలిపినారు ,చిన్న వయస్సులో ప్రసవం ప్రమాదకరమని ,చిన్న వయస్సులో పిల్లలు కలిగితే వారిని పెంచే మానసిక వికాసం,స్థోమత తల్లితండ్రులకు ఉండకపోవచ్చునని తెలిపారు.బాల్య వివాహము చట్టరీత్యా నేరమని 18 సంవత్సరములలోపు బాలికలకు 21 సంవత్సరములలోపు అబ్బాయిలకి వివాహం చేస్తే పెల్లికుమారునికి వారి తల్లితండ్రులకు పెళ్ళిలో పాల్గొన్న వారిపై,పురోహితులపై, ప్రత్యక్షంగా,పరోక్షంగా    కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించినారు,ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు  మీ  దృష్టికి వచ్చిన హెల్ప్ లైన్ 1098  ద్వారా వెంటనే ఉన్నత స్తాయి అధికారులకు తెలియజేయాలని  సూచించినారు,బాల్య వివాహం చట్టరీత్యా నేరం,చట్టం ప్రకారం శిక్షర్వుహులు,బాల్య వివాహాలు ప్రోత్సహించిన రెండేళ్ళు జైలు శిక్ష లక్ష రూపాయలు జరిమానా అనే నినాదంతో తల్లితండ్రులకు  వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని తెలిపారు.     ఈ కార్యక్రమములో టీచర్ శిరోమణి , ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ సుధాకర్, కన్సల్టెంట్మల్లికార్జున  మరియు ప్రొజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.

About Author