ఆరోగ్య సిబ్బంది బదిలీకి..ఘన సత్కారం
1 min read

సీహెచ్ రంగస్వామి ఏఎన్ఎంల బదిలీ
ఘనంగా సన్మానించిన డాక్టర్లు..సిబ్బంది
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న సీహెచ్ఓ డి. రంగస్వామి మరియు ఏఎన్ఎంలు బదిలీ అయిన వారికి ఘనంగా సత్కరించారు.సోమవారం ఆస్పత్రి ప్రాంగణంలో డాక్టర్ పి. రాజు అధ్యక్షతన సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగినది.ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి బదిలీలు పదోన్నతులు సర్వసాధారణమని డాక్టర్ శివకుమార్ గౌడ్,డాక్టర్ సురేష్ కుమార్ అన్నారు.కరోనా సమయంలో ప్రజలకు ఎంతగానో సేవలు అందించారని వారి సేవలు ఎనలేనివని ఐఎన్ టీయుసీ జిల్లా అధ్యక్షులు నరసింహులు,రాష్ట్ర హంస జిల్లా అధ్యక్షులు రఘుబాబు అన్నారు.ఇక్కడి నుండి బదిలీపై వెళ్లిన వారిని శాలువాలు పూలమాలలతో సత్కరిస్తూ బహుమతులను అందజేశారు.
ఇక్కడి నుండి బదిలీపై వెళ్లిన వారు
2018 జూన్ నుండి ఇక్కడ పనిచేస్తున్న సీహెచ్ఓ రంగస్వామి కల్లూరుకు బదిలీ అయ్యారు.ఎంపీహెచ్ఏ నాగలక్ష్మి,అదేవిధంగా ఏఎన్ఎం లు జ్యోతి,రామ తులసీ,శ్రీదేవి,అనంతలక్ష్మి, లక్ష్మీ సరస్వతి,రిజ్వాన, కళ్యాణి,రమాదేవి బదిలీ అయినట్లు వీరి సేవలను అతిధులు కొనియాడారు.
ఇక్కడికి బదిలీపై వచ్చినవారు
కల్లూరులో పనిచేస్తున్న సీహెచ్ఓ సురేష్ బాబు ఇక్కడికి వచ్చారు.ఏఎన్ఎం లు సుమిత్ర,ఉమాదేవి, రాములమ్మ,బాల సరస్వతి, ఇందిరా,సునీత,కళ్యాణి అనంతలక్ష్మి ఇక్కడికి వచ్చారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ వ్యోమకేష్,ఉద్యోగుల సంఘం తాలూకా అధ్యక్షులు నర్సరాజు,సెక్రటరీ భువనేశ్వరి, ఏసేపు,కరుణానిధి,ఆస్పత్రి సిబ్బంది,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


