ప్రశాంతంగా పండుగలు జరుపుకోవాలి…
1 min read

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్
జిల్లా ప్రజలందరికి వినాయకచవితి పండుగలు శుభాకాంక్షలు
కర్నూలు , న్యూస్ నేడు: జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఈ నెల 27 న వినాయక చవితి పండుగ, సెప్టంబర్ 4 న వినాయక నిమజ్జనం పండుగలను పురస్కరించుకుని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ శాంతియుత (పీస్ కమిటి) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగరంలోని వివిధ వర్గాలకు చెందిన సామాజిక మత పెద్దలతో జిల్లా ఎస్పీ మాట్లాడారు. ముందస్తుగా జిల్లా ప్రజలందరికి వినాయక చవితి పండుగ తెలియజేస్తున్నామన్నారు. వినాయక విగ్రహాల వద్ద తాత్కలిక సిసి కెమెరాలను అమర్చుకునే విధంగా చూడాలన్నారు. కర్నూలు మతసామరస్యానికి స్పూర్తిగా నిలిచిందని కుల, మతాలకు అతీతంగా ప్రశాంతమైన వాతావరణంలో కలిసి మెలిసి పండుగలు జరుపుకోవాలన్నారు. పుకార్లు, వదంతలను ప్రచారం చేయకూడదన్నారు, నమ్మవద్దన్నారు. సోషల్ మీడియా, వాట్సప్ గ్రూప్ ల పై జిల్లా పోలీసులు నిఘా ఉంచారన్నారు.అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను పటిష్టం చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా , కర్నూల్ డిఎస్పి బాబు ప్రసాద్ , సిఐలు తేజమూర్తి, కేశవరెడ్డి, పార్థసారధి, విక్రమసింహా, నాగరాజా రావు, తబ్రేజ్, గణేష్ ఉత్సవ కమిటి సభ్యులు, మత పెద్దలు …ప్రభుత్వ ఖాజీ సయ్యద్ అబ్దుల్ సలాం, గణేష్ ఉత్సవ కమిటి అధ్యక్షుడు వేణుగోపాల్, గోరంట్ల రమణ, మౌలానా అబ్దుల్ ఖదీర్,మిలాద్ కమిటి అధ్యక్షుడు మౌలానా సయ్యద్ షఫీ భాషా ఖాద్రి, జామియా మసీధు ధర్మకర్త భాసు మియా, టిడిపి మైనారిటీ లీడర్ షమిభాషా, ప్రతాపరెడ్డి , పూల రంగస్వామి, మద్దిలేటి, జోగయ్య శర్మ, అబ్దుల్ రజాక్ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

