స్క్వాడ్ వస్తుంది.. బెల్టు మూసేయండి…
1 min read

మహానంది, న్యూస్ నేడు: స్క్వాడ్ వస్తుంది… బెల్టులు మూసేయండి అని ముందే సమాచారం లీక్ అయినట్లు విశ్వాసనీయ సమాచారం. మహానంది మండలంలో వివిధ గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపు యజమానులు అందరూ తాత్కాలికంగా వచ్చినసార్లు వెళ్లిపోయేంతవరకు బెల్ట్ షాపులు/ మొబైల్ బెల్ట్ షాపులు నిర్వహించవద్దని అనధికారిక ఆదేశాలు/ లీకులు కావడంతో బెల్ట్ షాపు నిర్వాహకులు కలిసికట్టుగా దుకాణాలు బందు పాటించినట్లు తెలుస్తుంది. బుధవారం ఉదయం నుండే ఈ బంద్ వాతావరణం కనిపించడం చర్చనీయాంశంగా మారడం ప్రాధాన్యత సంతరించుకుంది. స్క్వాడ్ అధికారులు లైసెన్స్ మద్యం దుకాణాలను తనిఖీ చేసినట్లు తెలుస్తుంది. ఏమైనా కల్తీ మద్యం బాటిల్లను షాపుల నుండి బెల్ట్ షాపులకు తరలిస్తున్నారా లేదా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది. స్క్వాడ్ తనిఖీలకు వస్తున్న విషయం ముందే బెల్ట్ షాపు నిర్వాహకులకు ఎలా లీక్ అయింది అనేది ఆశ్చర్యకరంగా మరి నట్లు తెలుస్తుంది. ఉన్నతాధికారులు ఆదేశిస్తే తప్ప దాడులు చేయని సిబ్బంది వారి ఆదేశాలు బెల్టులకు ఎలా చేరాయి అనే దానిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. మహానంది మండలంలో స్క్వాడ్ తనిఖీలు చేపట్టిన ఏ ఒక్క బెల్ట్ షాప్ నిర్వాహకులు నుండి కనీసం నాలుగు మద్యం బాటిల్లు స్వాధీనం చేసుకోకపోవడం విచిత్రంగా ఉందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. తూతూ మంత్రంగా నామమాత్రంగా దాడులు నిర్వహించినట్లు సమాచారం. మేము వచ్చాము మీరు బెల్టులను మూసివేశారు. మాకు అంతే చాలు. తర్వాత మీ ఇష్టం . మహానంది మండలంలో వివిధ గ్రామాల్లో ప్రత్యేక అధికారులు/ సిబ్బంది తిరిగి దాడులు నిర్వహించిన ఫలితం మాత్రం శూన్యంగా మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకు ఆ లీకు వీరులు ఎవరు అనేది తేట తెల్లం కావాల్సి ఉంది. మండలంలోని మద్యం దుకాణాల యజమానులు సిండికేట్ గా మారి బెల్ట్ షాపులకు అనధికారికంగా మద్యం తరలిస్తూ మద్యం విక్రయాలు కొనసాగిస్తూ చేసుకుంటూ ఉన్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఎక్సైజ్ శాఖ దాడులు నిర్వహించిన కేవలం బెల్ట్ షాపు నిర్వాహకుల వద్ద నాలుగు నుండి ఏడు మద్యం బాటిళ్ల వరకే దొరికాయని రికార్డుల్లో నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.

