NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం

1 min read

వ్యాధికారకం-ప్లాస్టిక్‌ భూతo

జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హితవు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: వ్యాధికారకం-ప్లాస్టిక్‌ భూతమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హితవు పలికారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు.కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతినెలా మూడవ శనివారం లక్ష్యసాధన దిశగా కొనసాగుతోంది. ఇదేక్రమంలో ఈ శనివారం కూడా అంతే ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగింది. స్థానిక 2వ డివిజన్ బావిశెట్టివారి పేట భూలోకమ్మ తల్లి గుడి వద్ద ప్లాస్టిక్ రహిత రాష్ట్రం థీమ్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్టీసి విజయవాడ జోన్‌-2 చైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడుతో కలిసి ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తొలుత వారికి ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం స్థానిక ప్రజలందరితో స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం స్థానికంగా మొక్కలను నాటారు. అలాగే పారిశుద్ధ్య నిర్వహణలో మెరుగైన పనితీరు కనపరిచిన ముగ్గురు కార్మికులకు బహుమతులు అందించి, వారిని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర లక్ష్యాన్ని నెరవేర్చే లక్ష్యంతో దాని విశిష్టతను కూటమి నాయకులతో కలిసి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నామన్నారు. అన్నింటినీ కలుషితం చేసి పడేస్తోన్న ప్లాస్టిక్‌ భూతం ప్రజలకు అనేక వ్యాధులను కలిగిస్తోందన్నారు. క్యాన్సర్‌ వ్యాధి పెరగడానికి గల కారణాల్లో ప్లాస్టిక్‌ ఒకటన్న ఆయన ప్రజలు వీలైనంతగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించుకోవాలని హితవు పలికారు. భవిష్యత్తు తరాలకు ప్లాస్టిక్‌ పెనుభూతం కాకుండా ఉండాలనే ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందంటూ ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఈడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, ఎఎంసి చైర్మన్‌ మామిళ్ళపల్లి పార్థసారధి, డిప్యూటి మేయర్‌ కర్రి శ్రీనివాస్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ ఎ. భానుప్రతాప్‌,కో-ఆప్షన్‌ సభ్యులు ఎస్సెమ్మార్‌ పెదబాబు, కార్పొరేటర్‌ జున్నూరు కనక నరసింహారావు, క్లస్టర్ ఇంచార్జ్ అమరావతి అశోక్,బిజెపి నాయకులు గాది రాంబాబు, జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు, క్లస్టర్ కో ఇన్చార్జ్ మేడపల్లి ఏసు,డివిజన్ ఇన్చార్జి నాగులపల్లి గంగాధర్ రావు, డివిజన్ కో ఇన్ఛార్జ్ లంకలపల్లి సతీష్, డివిజన్ ప్రెసిడెంట్ శంఖా బత్తుల నాగరాజు,సెక్రటరీ వెంప అనిల్, డివిజన్ నాయకులు మేకల సీతారామయ్య, బావిశెట్టి నందగోపాల్, వోల శ్రీనివాసరావు, పప్పు రాంబాబు, తోట లక్ష్మి   తదితరులు పాల్గొన్నారు.

About Author