స్పందించిన గ్రామ సర్పంచ్,ఏ ఈ విద్యుత్ అధికారి నరసన్న
1 min read

కాలనీల్లో సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి
తొలగిన విద్యుత్ తీగలపై తిప్పా తీగలు
కౌతాళం , న్యూస్ నేడు : మండల కేంద్రంమైనపొంచి ఉన్న ప్రమాదం పల్లెవెలుగు దినపత్రిక శీర్షికకు గ్రామ సర్పంచ్ పాల్ దినకర్ వెంటనే స్పందించి విద్యుత్ అధికారులు తో మాట్లాడి తలారి గేరిలో విద్యుత్ స్తంభాలపై ఉన్న విద్యుత్ తీగలపై తిప్పతీగలు ముళ్ళ తీగలు చెట్టుకొమ్మలు అంటుకొని ఉండగా వాటిని చూసి కాలనీవాసులు భయాందోళనకు గురి అవుతున్నారని తెలుసుకొని వాటిని కార్మికులచే తొలగించారు. వారు మాట్లాడుతూ సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కోరారు. సమస్యలు చిన్నగా ఉంటే వెంటనే చర్యలు తీసుకుంటామని సమస్యలు పెద్దగా ఉంటే నాయకులకు దృష్టికి తీసుకువెళ్తామని కోరారు. విద్యుత్ తీగలపై ముళ్ళ తీగలు తొలగడంతో తలారి గేరి కాలనీవాసులు గ్రామ సర్పంచ్ కు కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు.

