పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీ పునః ప్రారంభోత్సవ నికి హాజరైన ఎమ్మెల్యే , ఎంపీ
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: బేతంచర్ల మండలంలోని సిమెంట్ నగర్ గ్రామంలో పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీ పునఃప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి, నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి హాజరై, ప్రజలకు అభినందనలు తెలిపారు. పునఃప్రారంభం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు, అధికారులు పాల్గొన్నారు.


