PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విజేత‌కి విజేతే పుడ‌తాడు !

1 min read

పల్లెవెలుగువెబ్ : మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నేడు (ఆదివారం ) పుట్టిన రోజు వేడుక‌లు జ‌రుపుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, తండ్రి మెగాస్టార్ చిరంజీవి చెర్రీకి సినిమా పరంగా, పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలుపగా.. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా డైలాగ్ రైటర్ బుర్రా సాయిమాధవ్.. చెర్రీకి తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రపంచాన్ని గెలుస్తున్న రాముడు .. విశ్వవెండితెర మీద విజయసంతకం చేస్తున్న సీతారాముడు… విజేతకి విజేతే పుడతాడని నిరూపించిన రాంచరణ్ సార్ కి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ సాయిమాధవ్ చెర్రీని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా విషెస్ తెలిపారు. ప్రస్తుతం సాయిమాధవ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

                                              

About Author