మూడవరోజు వేసవి విజ్ఞాన శిబిరం
1 min read
వేమన శతకంలో ముఖ్యంశాలు బోధన ..
గ్రంథాలయ అధికారి దుగ్గిపోగు జాన్ బాబు
విద్యార్థినీ,విద్యార్థులను ఆకట్టుకుంటున్న ఉచిత వేసవి విజ్ఞాన శిబిరం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :పెదపాడు శాఖా గ్రంధాలయం నందు వేసవి సెలవులలో భాగంగా ఉచిత వేసవి విజ్ఞాన శిబిరంలో మూడవరోజు బుధవారం రిసోర్స్ పర్సన్ ధారా శివపార్వతిచే వేమన రచించిన “వేమన శతకంలోని “వేమన పద్యములు చెప్పి వాటి భావమును విపులముగా విద్యార్థిని విద్యార్థులకు అర్థమయ్యే రీతిగా తెలియజేసినారు అనంతరం సరిశేపల్లి లక్ష్మీనారాయణ రచించిన “మాటలు నేర్చిన చిలుక” అనే కథను బాలబాలికలచే చదివించడం జరిగినది. తర్వాత క్యారమ్స్ ఆట ఆడించి దానిలోని మెలుకువలను నేర్పించడం జరిగినది.ఈ కార్యక్రమమునకు 29 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఉచిత విజ్ఞాన శిబిరాలు విద్యార్థి, విద్యార్థులను ఎంతో ఆకట్టుకుంటున్నాయని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.గ్రంథాలయ అధికారి దుగ్గిపోగు జాన్ బాబు పర్యవేక్షణ ఆధ్వర్యంలో నిర్వహించుట జరిగినది. అనంతరం పాల్గొనిన విద్యార్థిని విద్యార్థులకు మంచినీరు అందించి స్నాక్స్ పంచిపెట్టడం జరిగినదనిఅన్నరు.