NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కూటమిలో తప్పు చేసిన వారు వైసిపి కోవర్టులా..

1 min read

కల్తీ మద్యంతో కూటమికి కౌంట్ డౌన్

వైసీపీకూటమి ప్రభుత్వ పనితీరుపై విరుచుకుపడిన వైసిపి  రాష్ట్ర నాయకులు సత్య సాయినాథ్ శర్మ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ద్వజం

కమలాపురం ,న్యూస్ నేడు : కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటాడడమే కాకుండా కూటమి  ప్రభుత్వంలో తప్పు చేసిన వారు వైసిపి కోవర్ట్ లుగా కూటమి అగ్ర నాయకులు పేర్కొనడం వారి సిగ్గులేని తనానికి నిదర్శనమని వైసిపి రాష్ట్ర ఎస్ఈసి సభ్యుడు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ  వైసిపి పార్టీ  రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి  కూటమి ప్రభుత్వ పనితీరు పై ద్వజమెత్తారు.కమలాపురం లోని  వైసీపీ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులతో కలిసి  వారు మాట్లాడారు.రాష్ట్రంలో కల్తీ మద్యంతో రాష్ట్ర ప్రభుత్వ పరువును కూటమి ప్రభుత్వం దిగదార్చిందన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కల్తీ మద్యం రాష్ట్రవ్యాప్తంగా ఏరులై పారిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండడం 40 సంవత్సరాల చంద్రబాబు రాజకీయ అనుభవం చివరకు చీప్ లిక్కర్ అమ్ముకోవడానికి ఉపయోగపడుతోందని వారు ఎద్దేవా చేసారు. జిల్లాకు చెందిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి చీప్ లిక్కర్ విషయంలో తాను కాణిపాకం వెళ్లి ప్రమాణం చేస్తా అనడం ఆయన అవినీతికి అద్దం పడుతుందన్నారు . చీప్ లిక్కర్ వ్యవహారంపై సిబిఐ విచారణకు ఆదేశించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోందని వారు ప్రశ్నించారు.ముఖ్యమంత్రి కల్తీ మద్యం వ్యవహార పై సిట్ ఏర్పాటు చేస్తానని ప్రకటించడం గమనిస్తుంటే కేవలం వైసీపీ నాయకులను ఇందులో ఇరికించడానికి ఆయన పన్నుతున్న కుట్రగా వారు పేర్కొన్నారు .రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమ మద్యం అని వైసిపి నాయకులపై అక్రమ కేసులు పెడుతున్న ప్రభుత్వానికి చీప్ లిక్కర్ వ్యవహారం చెంపదెబ్బ గా మారిందన్నారు .రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భగవంతుడిని నమ్ముతాడని తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందని ఆయన భావిస్తారనడానికి నిదర్శనం రాష్ట్రంలో అక్రమ మద్యం పేరుతో వైసిపి నాయకుల పై నిందలు వేసిన కూటమి ప్రభుత్వానికి చీప్ లిక్కర్ వ్యవహారమే భగవంతుడు ఇచ్చిన ప్రతీకార చర్యగా  వారు పేర్కొన్నారు.ఈ సమావేశంలో వైసీపీ  నాయకులు  రాజారెడ్డి కల్లూరు జనార్ధన రెడ్డి  ఎంపీటీసీ నాగరాజా చారి మాజీ సర్పంచ్ లు దానం  రమణ శ్రీనివాసుల రెడ్డి పెద్దచెప్పలి శేఖర్ కొండాయపల్లె రాయప్ప   మాజీ ఎంపీటీసీ సుబ్బారెడ్డి జగన్నాథ రెడ్డి  సుబ్బన్న చంటి  చంద్రపాల్ పెద్ద చెప్పల్లి మాజీ సర్పంచ్ శేఖర్ పెద్ద చెప్పల్లి  మాజీ సర్పంచ్ శేఖర్ నల్లింగాయపల్లె కొండారెడ్డి  తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

About Author