NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నకిలీ మద్యంతో సామాన్యుల ప్రాణాలను బలిగొంటున్న కూటమి ప్రభుత్వం 

1 min read

 పత్తికొండ, న్యూస్​ నేడు:  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా నకిలీ మద్యంతో సామాన్యుల ప్రాణాలను బలిగొంటుందని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ ఆరోపించారు. సోమవారం పత్తికొండ పట్టణం లోని  ఎక్సైజ్ కార్యాలయం ముందు వైసిపి. శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి కూటమి ప్రభుత్వంలోని నాయకులు అక్రమ మద్యం వ్యాపారం చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే వైఎస్ఆర్సిపి రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎక్సైజ్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సంబంధిత అధికారులకు వినతి పత్రం అందజేస్తున్నామని తెలిపారు. నకిలీ మద్యంపై కూటమి ప్రభుత్వం స్పందించి స్వచ్ఛందంగా సిబీఐ విచారణ  కోరాలని డిమాండ్ చేశారు. స్థానికంగా ఎక్సైజ్ శాఖ కూడా మొద్దు నిద్ర విడాలని సూచించారు.పల్లెలు పట్టణాలు తేడా లేకుండా గుడి, బడి సంబంధం లేకుండా వీధి వీధికి బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి నకిలీ మద్యాన్ని ప్రజలకు  అమ్ముతూ వారి ప్రాణాలను బలిగొంటున్నారని మండిపడ్డారు. పత్తికొండ నియోజకవర్గం లో మద్ది కేర మండలంలోని యడవలి గ్రామానికి చెందిన పెద్దన్న అనే వ్యక్తి అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని టిడిపి నాయకుడు బార్ నందు నకిలీ మద్యం తాగి చనిపోయిన సంఘటనపై ఆమె ప్రభుత్వంపై దుమ్మెత్తు పోశారు. నకిలీ మద్యాన్ని టిడిపి నాయకులు ఒక పరిశ్రమ లాగా వాడుకుంటూ నకిలీ మద్యం తయారు చేసి రాష్ట్రమంతా విస్తరించారని అన్నారు. అందుకు ఉదాహరణగా చిత్తూరు జిల్లా ములకలచెరువు విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం నందు దొరికిన నకిలీ మద్యం డంపులే నకిలీ మద్యానికి ప్రత్యక్ష సాక్ష్యం.

About Author