కనకదిన్నెలో టమాటా పరిశ్రమ..! నెరవేరబోతున్న టమాటా రైతుల ఆశలు
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు: పత్తికొండ నియోజకవర్గం లో టమోటా పరిశ్రమ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న టమోటా రైతుల ఆశలు ఎట్టకేలకు నెరవేరబోతున్నాయి. ఎదురుచూస్తున్న నియోజకవర్గం లోని దూదేకొండ గ్రామ రెవెన్యూ పరిధి కనక దిన్నె గ్రామంలో టమోటా ప్రాసెస్ యూనిట్ స్థాపించడానికి అధికారులు సమయార్థమవుతున్నారు. ఈ మేరకు పత్తికొండ నియోజకవర్గం దూదెకొండ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు-63/3లో 2.50(రెండున్నర ఎకరాల భూమిలో రూ.11 కోట్లతో ప్రాసెసింగ్ యూనిట్ను నెలకొల్పబోతున్నట్లు ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. కనకదిన్నెలో ఆహార శుద్ధి సొసైటీ(ఎ.పి.ఎఫ్.పి.ఎస్.) ఆధ్వర్యంలో ఆర్. కె.వి.వై. పథకం కింద రూ.8 కోట్లు, ఆపరేషన్ గ్రీన్స్ పథకం నిధులు రూ.3 కోట్లు వెచ్చించి పరిశ్రమను నిర్మించనున్నారు.ఈనెల 14న పత్తికొండ ఎమ్మెల్యే కె. ఈ. శ్యాం కుమార్ శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.