NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలి: ఎస్ఐ నాగార్జున

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని, లేనిచో చట్టబద్దత చర్యలు తీసుకుంటామని జలదుర్గం ఎస్ఐ పి. నాగార్జున పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం జల్దుర్గం సర్కిల్ పోలీస్ స్టేషన్ నందు ఆటో డ్రైవర్లకు ,లారీ డ్రైవర్లను పిలిపించి వారికి ట్రాఫిక్, నియమ నిబంధనలపై ఆయన అవగాహన కల్పిస్తూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలన్నారు. వాహనాలకు సంబంధించి తీసుకోవాలని ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

About Author