బ్యాలెట్ బాక్సులు ట్రాన్స్పోర్టేషన్ పకడ్బందీగా చేపట్టాలి
1 min read– జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్
పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి : మార్చి 13వ తేదీ జరిగే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రిసెప్షన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్స్ ల ట్రాన్స్పోర్టేషన్ పగడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ సంబంధిత అధికారులకు సూచించారు.గురువారం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో బ్యాలెట్ బాక్స్ లు మరియు జంబో బాక్స్ లు ఓపెన్, క్లోజ్ చేయడం, బ్యాలెట్ బాక్స్ ట్రాన్స్పోర్టేషన్ పై అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. పట్టబద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అన్నమయ్య జిల్లాలో 16 రూట్లు ఉన్నాయన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ స్టేషన్ లకు బ్యాలెట్ బాక్సులు పగడ్బందీగా తరలించాలన్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్సులు, జంబో బాక్స్ లకు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో జాగ్రత్తగా సీల్ వేయాలన్నారు. ప్రతి బ్యాలెట్ బాక్స్ కు సీరియల్ నెంబర్, పోలింగ్ స్టేషన్ వివరాలు తప్పకుండా ఉండాలన్నారు.బ్యాలెట్ బాక్స్ లు ఓపెన్, క్లోజ్ చేయడంపై పోలింగ్ అధికారులు సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో జంబో బాక్సులు ట్రాన్స్పోర్టేషన్ గురించి సంబంధిత అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియ, డి ఆర్ ఓ సత్యనారాయణ, ఎన్నికల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.