NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పింఛన్ లబ్ధిదారులతో మర్యాదపూర్వకంగా, మంచి ప్రవర్తన తో మెలగాలి

1 min read

పింఛన్ పంపిణీ లో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

పింఛన్ పంపిణీ అధికారులను హెచ్చరించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

కర్నూలు, న్యూస్​ నేడు : ఎన్టీఆర్  భరోసా పింఛన్లను పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారులతో మర్యాదపూర్వకంగా, మంచి ప్రవర్తన తో మెలగాలని, పింఛన్ పంపిణీ లో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పింఛన్ పంపిణీ అధికారులను హెచ్చరించారు.మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పెన్షన్ పంపిణీ పై ఐవిఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత పెన్షన్ పంపిణీ అధికారులతో  జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  పింఛన్ అందించిన అధికారి ప్రవర్తన ఎలా ఉంది, మీరు పింఛన్ తీసుకునేటప్పుడు ఏదైనా అవినీతిని గమనించారా అని రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేయించడం జరిగిందని,  ఇందులో గత 3,4  నెలల్లో ఎక్కువ ఫిర్యాదులు వచ్చిన పెన్షన్ పంపిణీ  అధికారులను సమావేశానికి పిలిచామని తెలిపారు.. 4000 మంది పెన్షన్ పంపిణీ అధికారులకు గాను 32 మందిపై మూడు సార్లు  కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు.. ఇకపై ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని, పెన్షన్ పంపిణీ చేసే అధికారులు జాగ్రత్తగా పని చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజల కోసం మనం పని చేస్తున్నామని, ప్రజలు ఇచ్చే డబ్బుతోనే మనకు ప్రభుత్వం వేతనాలు ఇస్తుందని, కాబట్టి బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ హితవు పలికారు. పెన్షన్ లబ్ధిదారులతో మర్యాదగా మాట్లాడాలని, మంచి ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ఐదు మంది సిబ్బంది మీద అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చాయని, ప్రభుత్వం పేదలకు నెలకు 4000 రూపాయలు ఇస్తే అందులో నుంచి డబ్బు తీసుకోవడం చాలా ఘోరమైన పని అని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.. ఈ ఐదుగురి మీద విచారణ చేయాలని, డిఆర్ డి ఎ  పిడి ని ఆదేశిస్తూ, అవినీతికి పాల్పడినట్లు రుజువైతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.ఫిర్యాదులు ఎందుకు వచ్చాయని పెన్షన్ పంపిణీ అధికారులతో కలెక్టర్ ఆరా తీశారు.. కొన్ని  సమస్యల గురించి వారు వివరించగా, పెన్షన్ పంపిణీ సమయంలో మీకు వస్తున్న ఇబ్బందులను ఎంపీడీవోలకు వ్రాతపూర్వకంగా తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. పెన్షన్ పంపిణీ సందర్భంగా గ్రామాల్లో ఆయా  ప్రదేశాలకు టైమ్ స్లాట్ కేటాయించి, వారికి ముందే సమాచారం ఇచ్చి ఆ సమయానికి అక్కడికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్ఆర్ఈజీఎస్,  వ్యవసాయ పనులకు వెళ్లే  శ్రామికులకు ముందుగానే పెన్షన్ ఇచ్చే సమయాన్ని వారికి తెలియజేసి,  వారికి పెన్షన్ పంపిణీ చేయాలని సూచించారు..అంతకుముందు జిల్లా పరిషత్ సీఈవో నాసర రెడ్డి, డి ఆర్ డి ఏ ప్రాజెక్టు డైరెక్టర్ రమణారెడ్డి లు మాట్లాడుతూ  జిల్లాలో  దాదాపు 2 లక్షల 38 వేల పెన్షన్లను ప్రతినెల పంపిణీ చేస్తున్నామని, ఇందులో ఎటువంటి అవినీతికి అవకాశం లేకుండా పంపిణీ చేయాలని, ప్రజల మనసు గెలుచుకునే విధంగా పంపిణీ చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని రావాలని సూచించారు. సమావేశంలో డిఆర్డిఏ పిడి రమణారెడ్డి, జెడ్పిసిఈఓ నాసర రెడ్డి, ఫిర్యాదులు వచ్చిన  పెన్షన్ పంపిణీ అధికారులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *