కలెక్టరేట్ కు రెండు ఏసీలు, 5 వాటర్ డిస్పెన్సర్లు
1 min read
జిల్లా కలెక్టర్ కు అందజేసిన కెనరా బ్యాంక్ అధికారులు
నంద్యాల, న్యూస్ నేడు: కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కెనరా బ్యాంక్ అధికారుల బృందం జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గారికి ప్రజల సౌకర్యార్థం రెండు ఏసీలు, 5 వాటర్ డిస్పెన్సర్లు అందజేశారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ లకు ప్రజల సౌకర్యార్థం రెండు ఏసీలు, 5 వాటర్ డిస్పెన్సర్లను కర్నూలు లీడ్ డిస్టిక్ మేనేజర్ రామచంద్ర, నంద్యాల కెనరా బ్యాంక్ చీఫ్ మేనేజర్ లు సుబోధ్, టి. అనంత్, రాకేష్ రంజన్, కర్నూల్ బ్రాంచ్ డివిజనల్ మేనేజర్ సురేష్ కుమార్, నంద్యాల మెయిన్ బ్రాంచ్ ఆఫీసర్ శివశంకర్ తదితరులు పరికరాలను అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కెనరా బ్యాంక్ అధికారుల బృందం జిల్లా కేంద్రానికి పరికరాలు అందజేయడం సంతోషదాయకమని కోరుకుంటూ కెనరా బ్యాంక్ అధికారులకు అభినందనలు తెలిపారు. వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా కలెక్టరేట్ లోని విజిటర్స్ లాబిన్ లో ప్రజలకు వేసవి తాపాన్ని తగ్గించేందుకు ఒక టవర్ ఏసితో సాధారణ ఎసినీ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే పిజిఆర్ఎస్ హాలులో 5 వాటర్ డిస్పెన్సర్లను అర్జీదారుల దాహార్తిని తీర్చేందుకు వినియోగిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, సెక్షన్ సూపర్డెంట్లు తదితరులు పాల్గొన్నారు.