యునాని మెడికల్ కళాశాల అభివృద్ధికి కృషి
1 min read

మేనేజ్ మెంట్ కోటాలో 25 సీట్లు పెంచేలా చూస్తా..
- డా. ఎన్టీ ఆర్ హెల్త్ యూనివర్శిటీ వీసీ డా. చంద్ర శేఖర్
- డా. అబ్దుల్ హక్ యునాని మెడికల్ కాలేజిని తనిఖీ చేసిన వీసీ
కర్నూలు హాస్పిటల్ , న్యూస్ నేడు: విద్యార్థులకు చదువుతోపాటు పరిశోధనలపై కూడా శిక్షణ ఇవ్వాలని డా. ఎన్టీ ఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డా. చంద్ర శేఖర్ సూచించారు. సోమవారం కర్నూలులోని డా. అబ్దుల్ హక్ యునాని మెడికల్ కాలేజిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా వీసీ డా. చంద్ర శేఖర్ మాట్లాడుతూ డా. అబ్దుల్ హక్ యునాని మెడికల్ కాలేజి రాష్ట్రంలో ఎక్కడా లేదని, కర్నూలులో మాత్రమే ఉందని, అటువంటి యునానీ మెడికల్ కాలేజి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం కాలేజిలోని 50 మెడికల్ సీట్లు ప్రభుత్వం ఆధ్వర్యంలో పూర్తి చేస్తున్నామని, త్వరలో మేనేజ్ మెంట్ కోటా కింద 25 సీట్లు పెంచేలా చేస్తానని హామీ ఇచ్చారు. పీజీ సీట్లు సైతం తీసుకుని వస్తానని డాక్టర్.చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలల్లో రీసెర్చ్ కోసం 10 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. మెడికల్ విద్యార్థులు యునాని మెడికల్ కాలేజిలో చదివేందుకు పోటీ పడుతున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని కళాశాల అభివృద్ధికి పాటు పడతానన్నారు. ఈ సందర్భంగా యునానీ కళాశాలలోని సమస్యలను ప్రిన్సిపాల్ డాక్టర్. జైన్ ముల్ హబిద్.వైస్. చాన్స్ లర్ డాక్టర్. చంద్రశేఖర్ దృష్టికి తీసుకువచ్చారు.

