NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కుల మతాలకతీతంగా ఉరుసు మహోత్సవాలు..

1 min read

చాగలమర్రి రూరల్  న్యూస్​ (నేడు ): మండల పరిధిలోని కృష్ణం పల్లె, పెద్ద వంగలి గ్రామాలలో ఉరుసు మహోత్సవాలు దర్గా నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. సోమవారం, మంగళవారం ఉదయం, రాత్రి సమయంలో కులాలకు మతాలకు అతీతంగా కడప ప్రొద్దుటూరు, దువ్వూరు, రాజుపాలెం, కూలూరు, ఆళ్లగడ్డ, చాగలమర్రి కాన గూడూరు తదితర గ్రామాల నుండి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. దర్గాలో అల్లాకు ప్రత్యేక ప్రార్థనలతో పాటు మృక్కుబడులను చెల్లించారు. భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వాహకులు ఏర్పాటు చేశారు.ఉరుసు మహోత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్సై రాజారెడ్డి డీఎస్పీ సీఐ ఆదేశాల మేరకు బందోబస్తు నిర్వహించారు.

About Author