శాఖాహారమో.. మాంసాహారమో ఖచ్చితంగా చెప్పాలి !
1 min readపల్లెవెలుగు వెబ్ : ప్రజలు కొనుగోలు చేసే వస్తువులు ఏయే పధార్థాల ఆధారంగా తయారు చేయబడ్డాయో ఖచ్చితంగా తెలపాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. దుస్తులు, గృహోపకరణాలు, ఇతర వస్తువుల తయారీలో వాడిన పధార్థాలను సూచించేలా విధిగా మాంసాహారం లేదా శాఖాహారం అని ముద్రించేలా ఆదేశాలు జారీ చేయాలని ఓ సంస్థ ఢిల్లీ హైకోర్టులో వేసిన దావా పై కోర్టు కేంద్రానికి నోటీసులు పంపింది. ప్రతి ఒక్కరికి తాము వాడుతున్న వస్తువు గురించి తెలుసుకునే హక్కు, తమ నమ్మకాలను అనుసరించే హక్కు ఉందని తెలిపింది. ఈ విషయాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకోవాలని హైకోర్టు నోటీసులు పంపింది. ఉత్పత్తుల ముద్రణ లేకపోవడం వల్ల శాఖాహారులు మాంసాహారంతో తయారు చేసిన వస్తువులు వాడాల్సి వస్తోందని రామ్ గౌ రక్షా దళ్ అనే సంస్థ తెలిపింది.