NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉల్చాల సర్కిల్ లో వాహనాల తనిఖీ…

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: సంవత్సరం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ కర్నూలుపరిధిలో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ నేరముల నిమిత్తం రాబడిన సమాచారం మేరకు ఉల్చాల సర్కిల్ నందు వాహనాల తనిఖీ చేయుచుండగా ఒక వాహనం అనుమానాస్పదంగా వెనక్కి వెలుచూ ఉన్న క్రమంలో దానిని ఆపి సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలించు నిమిత్తం చూడగా అందులో రెండు తెల్లని సంచులు ఉండినవి ఆ సంచులలో ఒక సంచిలో 100 బండిల్స్ ఉండి ఒక్కో బండి లు 100 సాచెట్లు  కలిగి సుమారు పదివేల ఖాళీ  సాచెట్లు  ఉండినవి వాటిని పరిశీలించగా అమృత్స్ సిల్వర్ కప్స్ రేర్ ఇండియన్ బ్రాందీ  కర్ణాటక  రాష్ట్రానికి చెందినవి గా ఉండినవి. తదుపరి విచారణలో సదరు వ్యక్తి అయిన పింజారి మిన్నెలా అక్రమ మద్యం తయారీ నిమిత్తం అధిక ఆదాయం లో భాగంగా హైదరాబాదులో గల అబ్దుల్ కలాం వద్ద సాచెట్లు తీసుకొని రావడం జరిగినది ఇందులోకి సహకరించినటువంటి కర్ణాటక రాష్ట్రానికి చెందిన చంద్రబాబు యొక్క కారు ను ఈ అక్రమ మద్యం తయారు  చేయడం కొరకు వాడుకుంటారు అని చెప్పడం జరిగినది. ఈ కారులో మరొక సంచిలో నాటు సారా సుమారు 10 లీటర్ల వరకు ఉండినది. హైదరాబాదుకు చెందిన అబ్దుల్ కలాం వద్ద సాచెట్లతోపాటు రెక్టిఫైడ్ స్పిరిట్  ను కొనుగోలు చేయుటకు రెండు లక్షల రూపాయలు అతనికి ఇచ్చినట్లు అందులో భాగంగా మొదటి విడతగా సా చెట్లను పంపినట్లు తదుపరి విడతలో స్పిరిట్ ను కూడా పంపుతానని చెప్పడంతో వేచి ఉన్నానని కానీ ఎంతకు స్పిరిట్ రాకపోవడంతో నాటు సారాను కొనుగోలు చేసి దానికి ఫుడ్ కలర్ కలిపి ప్యాకెట్లలో నింపుదామని ఆలోచనతో ఉన్నట్టు సదరు ముద్దాయి తెలిపినాడు కావున ఇందులో భాగంగా పింజారి మిన్నెలతో పాటు అబ్దుల్ కలాం హైదరాబాదు మరియు చంద్రబాబు కర్ణాటక రాష్ట్రం లను కేసులలో నమోదు చేయడం జరిగినది ఏఐ)ఫింజారి మిన్నెళ్లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడమైనది. తదుపరి ముద్దాయిలను త్వరలో అరెస్టు చేయడం జరుగుతుంది అని తెలియజేయడమైనది. ఈ మొత్తం వ్యవహారంలో సుమారు పదివేల లిక్కర్ ఖాళి సాచెట్లు, 10 లీటర్ల నాటు సారాయి మరియు హోండా సిటీ కంపెనీకి చెందిన ఒక కారు మరియు ఒక సెల్ ఫోను సీజ్ చేయడం జరిగినది కావున అక్రమ మద్యం వ్యాపారం చేయడం కల్తీ మద్యం తయారు చేయడం మరియు అమ్మడం నేరం కావున చట్టరీత్యా శిక్షార్హులవుతారని తెలియజేయడం జరిగినది.

About Author