కర్నూలు మెడికవర్ హాస్పిటల్‌లో రోగుల మధ్య రాఖీ పండుగ సందడి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: అన్నా చెల్లెళ్ల బంధానికి ప్రతీక అయిన రక్షా బంధన్ పండుగను కర్నూలు మెడికవర్ హాస్పిటల్స్‌లో హర్షాతిరేకాల మధ్య జరుపుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల ముఖాల్లో ఆనందం నింపి, వారికి కుటుంబ వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ఈ వేడుకను ప్రత్యేకంగా నిర్వహించింది. వైద్యులు, నర్సులు మరియు సిబ్బంది రోగులకు రాఖీలు కట్టి, మిఠాయిలు పంచి, స్నేహభావాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు సెంటర్ హెడ్ డాక్టర్ వై. మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “రోగులు ఆసుపత్రిలో ఉన్నప్పుడు, వారు కుటుంబ సభ్యుల దూరాన్ని ఎక్కువగా అనుభవిస్తారు. ఇలాంటి సందర్భాలు వారికి మానసిక బలం, ఆనందం కలిగిస్తాయి. ఇది వారి కోలుకునే ప్రక్రియలో కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది” అన్నారు.ప్రోగ్రాంలో పాల్గొన్న డా. శిల్పా చౌదరి పెద్దపొల్ల కన్సల్టెంట్ యూరోగైనకాలజీ, ప్రసూతి వైద్యుడు & గైనకాలజిస్ట్ మరియు డాక్టర్ సువర్ణ లక్ష్మి కల్లి, కన్సల్టెంట్ పల్మోనాలజిస్ట్ మాట్లాడుతూ, “రోగుల శారీరక చికిత్సతో పాటు మానసిక స్థైర్యం కూడా చాలా ముఖ్యం. రాఖీ పండుగ వంటి సాంస్కృతిక వేడుకలు రోగులకు ఆనందాన్ని, ధైర్యాన్ని అందిస్తాయి. ఇది ఒక హాస్పిటల్ మాత్రమే కాదు, ఒక పెద్ద కుటుంబం అని వారికి గుర్తు చేస్తాయి” అని పేర్కొన్నారు.రోగులు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ ప్రత్యేక వేడుకను హృదయపూర్వకంగా ఆస్వాదించి, హాస్పిటల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.


