ప్రభుత్వ బి.సి. ఎస్. సి, హాస్టల్స్ ను సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/17-12.jpg?fit=550%2C248&ssl=1)
పల్లెవెలుగు , కర్నూలు: ప్రభుత్వ బి.సి., ఎస్. సి, ఆనంద నిలయం హాస్టల్స్ , కలెక్టర్ ఆఫీస్ కాంపౌండ్ , కర్నూలు ను సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా జడ్జి శ్రీ జి. కబర్థి, కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా జడ్జి శ్రీ జి. కబర్థి ,కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి రాష్ట్ర న్యాయ సేవల అధికారం ఆదేశాల మేరకు శనివారం కర్నూలు కలెక్టర్ ఆఫీస్ నందు గల ప్రభుత్వ బి.సి., ఎస్. సి, ఆనంద నిలయం హాస్టల్స్ ను సందర్శించి ఆ హాస్ట ల్స్ లోని సౌకర్యాలు, ఆహారం నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించి వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకొన్నారు. కార్యాలయాలకు సంబందించిన రిజిస్టర్ లను పరిశీలించారు. ఏవైనా లోపాలు ఉంటే వాటి మీద అవసరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొనివేళతాము అని తేలేయజేశారు. అనంతరం విధ్యార్థులకు ఉచిత న్యాయ సహాయం కోరువారు లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నంబర్-15100 ఉపయోగించుకోవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.