NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం పై గోడ పత్రిక లను విడుదల

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు మరియు జిల్లా జడ్జి జి. కబర్థి   చేతుల మీదుగా లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం పై ప్రచురించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. జిల్లా జడ్జి మాట్లాడుతూ లైంగిక నేరాల నుండి రక్షణ చట్టం 2012 ప్రకారం పిల్లల పై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు కలవని తెలిపారు. 18 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడకుండా   ఈ పోక్సో యాక్ట్  ఉపయోగ పడుతుందని తెలిపారు.ఈ పోక్సో కేసుల ను త్వరిత గతిన పరిష్కరించేoదుకు ప్రత్యేక కోర్ట్ కలదని తెలిపారు. పిల్లలకు ఏదయినా సమస్య వస్తే  లీగల్ సర్వీసెస్ టోల్ ఫ్రీ నెంబర్ 15100 కాల్ చేస్తే వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సదస్సు లో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, ఎక్సజ్ మేజిస్ట్రేట్ అనిల్ కుమార్, లీగల్ సర్వీసెస్ యూనిట్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *