కోళ్లబావాపురం’లో ఎక్సైజ్ అధికారుల దాడులు
1 min read
ఇద్దరు మహిళల అరెస్ట్..
నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎస్ రవికుమార్ ఆదేశాల మేరకు నందికొట్కూరు మండల పరిధిలోని కోళ్లబావాపురం గ్రామంలో మంగళవారం నందికొట్కూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారులు దాడులు చేసినట్లు ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు తెలిపారు.ఈ దాడుల్లో 20 లీటర్ల నాటుసారా సీజ్ చేసి ఒక టీవీఎస్ ఎక్సల్ మోపేడ్ సీజ్ చేసి కావేటి రామేశ్వరమ్మ,ఎరుకులి మాధవి(అలియాస్ మద్దమ్మ) అనే ఇద్దరినీ అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేశామని అదేవిధంగా గ్రామ సమీప అటవీ ప్రాంతంలో నాటుసారా తయారికి సిద్ధం చేసిన 500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలోనందికొట్కూరు ఎక్సైజ్ ఎస్ఐలు భాష్యం శ్రీనివాసులు,జఫురుల్లా, కర్నూలు ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ శంకర్ నాయక్,కృపావర కుమారి,సిబ్బంది శివన్న, సుధీర్,పరీక్షిత్,విద్యా ప్రియదర్శిని,రాజశేఖర్ పాల్గొన్నారు.

