జీ.పులయ్య ఇంజనీరింగ్ కళాశాలలో స్వాగత .. వీడుకోలు కార్యక్రమం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: వెంకాయపల్లి నందు ఉన్న జి. పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో స్వాగత మరియు వీడ్కోల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి. శ్రీనివాసరావు విచ్చేశారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ కళాశాల యొక్క నైతిక విలువలు, క్రమశిక్షణ మరియు సాంప్రదాయ పద్ధతులను కొనసాగించాలంటే స్వాగతం మరియు వీడ్కోల కార్యక్రమం ఎంతో అవసరమని తెలియజేశారు. స్వాగత కార్యక్రమంలో కొత్తగా వచ్చిన విద్యార్థులు వారి సీనియర్స్ ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని తెలియజేశారు, కళాశాల ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులలో ఉన్న సాంస్కృతిక ప్రతిభను బయట పెట్టడానికి ఇదొక వేదిక లాంటిది, విద్యార్థుల సాంస్కృతి ప్రతిభ ఆట, పాట, మిమిక్రీ, డైలాగ్ టెల్లింగ్, మరియు పియానో ప్లేయింగ్ ఇలాంటివన్నీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తూ చదువులో పురోగతిని సాధించడానికి తోడ్పడుతుందని తెలియజేశారు. ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ప్రిన్సిపాల్ భవిష్యత్తులో మీరు సాధించవలసింది ఎంతో ఉందని ఆకాశమే హద్దుగా మీ లక్ష్యాన్ని సంధించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు ఫ్యాకల్టీ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
