హోం గార్డ్స్‌కు వెల్ఫేర్ ఫండ్ చెక్కులు అందజేత
1 min read
హోంగార్డు కమాండెంట్ యం. మహేష్ కుమార్
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు హోం గార్డ్స్ సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్ నుండి మంజూరైన చెక్కులను జిల్లా పోలీసు కార్యాలయంలోనిహోంగార్డు కమాండెంట్ కార్యాలయంలో సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ యం. మహేష్ కుమార్ హోంగార్డులకు సోమవారం అందజేశారు.హోం గార్డ్స్ సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్ నుండి మంజూరైన మొత్తం రూ. 60 వేల విలువైన చెక్కులను ఏడు మంది హోం గార్డ్స్ లకు అందజేశారు. మొత్తం 7 మందిలో ఇద్దరికి మ్యారెజ్ గ్రాంట్ క్రింద ఒక్కొక్కరికి రూ. 5 వేలు .5 మందికి మెడికల్ గ్రాంట్ క్రింద ఒక్కొక్కరికి రూ. 10 వేలు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో హోంగార్డు డీఎస్పీ ప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ శ్రీమతి కె. మాధవి రాణి, పోలీసు సిబ్బంది మరియు హోం గార్డ్స్ పాల్గొన్నారు.

