NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైద్య విద్యలో డిజిటల్ పరివర్తనకు ఇది ఒక ముఖ్యమైన అడుగు

1 min read

కర్నూలు,  న్యూస్​ నేడు: ఆధునిక సాంకేతికతను వైద్య విద్యలో సమర్థవంతంగా వినియోగిస్తూ, విద్యార్థుల నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కర్నూలు మెడికల్ కాలేజీ (KMC)లో ‘ఎడ్‌మెడ్ AI’ (EdMed AI) ఆధారిత CBME పైలెట్ ప్రాజెక్ట్‌ను సోమవారం రోజు  అడిషనల్ డీఎంఈలు, కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె. చిట్టి నరసమ్మ మరియు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ ఎన్‌టిఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (NTRUHS) ఆధ్వర్యంలో, జాతీయ వైద్య కమిషన్ (NMC) మార్గదర్శకాలకు అనుగుణంగా అమలులో ఉన్న Competency Based Medical Education (CBME) విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ AI ఆధారిత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టారని రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ప్రాయోగికంగా అమలు చేయబడుతున్న ఈ పైలెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా కర్నూలు మెడికల్ కాలేజీ ఎంపిక చేయడం పట్ల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా “వైద్య విద్యలో డిజిటల్ పరివర్తనకు ఇది ఒక ముఖ్యమైన అడుగు అని విద్యార్థులు సాంకేతిక వనరులను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలి” అని కోరారు.ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా విద్యార్థుల వ్యక్తిగత అభ్యాస శైలి (Personalized Learning)కు అనుగుణంగా మార్గదర్శనం లభిస్తుంది. అలాగే అధ్యాపకులకు బోధనలో సమర్థత పెరుగుతుంది.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీరాములు, డాక్టర్ విజయ్ ఆనంద్ బాబు, డాక్టర్స్ సింధియా శుభప్రద,ఏవో  నాగమణి మరియు ఇతర అధ్యాపకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *