NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సంకన్ పాండ్, పశుగ్రాసం, ఉద్యాన పంటలను పరిశీలన

1 min read

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

రైతులకు అందు తున్న ప్రభుత్వ పథకాలపై ఆరా

మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి :  పాండ్, పశుగ్రాసం, ఉద్యాన పంటల పనులను  అధికారులతో కలిసి పరిశీలించారు. వర్షపు నీరు వేగంగా ప్రవహించకుండా ప్రవాహ వేగాన్ని తగ్గించి, నీటిని కొంతసేపు నిల్వ ఉంచేలా వాగులు, వంకల్లో నిర్మిస్తున్న ఈ తరహా నీటి సంరక్షణ పనుల వల్ల భూగర్భ జలాల పెంపు దలకు, నీటి నిల్వకు ప్రయోజనం కలుగు తుందని అధికారు లు కలెక్టర్‌కు వివరించారు. పనుల నాణ్యత, ఉపయోగం పై కలెక్టర్ ఆరా తీశారు.అనంతరం పీలేరు మండల సరిహద్దు ప్రాంతం లోని గోడుమల్లు వారిపల్లి గ్రామ పరిధిలో వ్యవసాయ క్షేత్రాలను కలెక్టర్ పరిశీలించారు. అక్కడ సాగు చేస్తున్న పశుగ్రాస పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో పశుగ్రాసం సాగు, పాడి పశువుల పెంపకం ద్వారా రైతులకు కలుగు తున్న ప్రయోజనా లను అడిగి తెలుసు కున్నారు.సామూహిక పశుగ్రాస సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అంది స్తున్న సహకారాన్ని రైతులు సద్విని యోగం చేసుకో వాలని కలెక్టర్ సూచించారు. భూమి లేని పాడి పశువుల రైతులు కూడా భూమి ఉన్న రైతుల నుంచి భూమిని అధికారిక ఒప్పందం ద్వారా తీసుకుని పశు గ్రాసం సాగు చేసు కునే అవకాశం ఉందని అధికారులు వివరించారు.ఈ పథకం కింద కనీసం 50 సెంట్ల నుంచి గరిష్టంగా 10 ఎకరాల వరకు భూమిలో పశు గ్రాసాన్ని సాగు చేసుకోవచ్చని తెలిపారు. రెండు సంవత్సరాల పాటు పశుగ్రాసం సాగు, నిర్వహణకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని, పశుగ్రాస కొరతను అధిగమించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు.బహువార్షిక పశుగ్రాస పంటల ద్వారా సుమారు 60 రోజులకోసారి కోత తీసుకునే అవకాశం ఉండటం తో ఏడాదిలో ఆరు కోతల వరకు, ఎకరానికి సుమారు 150 టన్నుల వరకు పశుగ్రాసం పొందే అవకాశం ఉందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు.పశుగ్రాస సాగుపై ఆసక్తి ఉన్న రైతులు క్షేత్రస్థాయిలోని వ్యవసాయ, పశుసంవర్ధక, ఉపాధి హామీ సిబ్బందిని సంప్రదించి పథకం వివరాలను తెలుసుకుని ప్రయోజనం పొందాలని కలెక్టర్ సూచించారు.అనంతరం ఉద్యాన పంటల సాగును కూడా కలెక్టర్ పరిశీలించి, రైతులతో మాట్లాడారు. పంటల సాగు విధానం, దిగు బడులు, మార్కెటింగ్  అంశాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు అవసర మైన సాంకేతిక సహకారం, ప్రభుత్వ పథకాల ప్రయోజ నాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అందేలా అధికారులు చర్యలు తీసుకో వాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డ్వామా పిడి వెంకటరత్నం, పశుసంవర్ధక శాఖ జెడి గుణశేఖర్ పిళ్ళై, జెడిఏ హరిప్రియ, ఏపీసీఎన్ఎఫ్ డిపిఎం వెంకట మోహన్, ఉద్యానవన అధికారి సుకుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ ఏవో రమాదేవి, అయ్యా శాఖల సిబ్బంది  పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *