మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
1 min read
మహిళలు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనాలి
డిఆర్ఓ సి వెంకటనారాయణమ్మ
కర్నూలు , న్యూస్ నేడు: సమాజంలోని మహిళలందరూ అన్ని రంగాల్లో రాణించాలని డిఆర్ఓ సి వెంకటనారాయణమ్మ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించకుని కలెక్టరేట్ సునయన ఆడిటోరియం మైదానం లో “మానవతా” స్వచ్ఛంద సేవా సంస్థ మరియు ఏపీ జెఎసి వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న మహిళా క్రీడలను జిల్లా రెవెన్యూ అధికారి సి.వెంకటనారాయణమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ సమాజంలోని మహిళలందరూ అన్ని రంగాలలో రాణించాలని ఇప్పటికే మహిళలు ఉత్సాహంగా అన్ని రంగాలలో పనులు చేస్తూ వారి ప్రతిభను చూపుతున్నారన్నారు. మహిళలు మానసిక ఉల్లాసానికి ఉత్సాహానికి క్రీడల్లో పాల్గొని వారి ప్రతిభను కనపరచాలన్నారు. శనివారం ఘనంగా నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పునస్కరించుకొని కలెక్టర్ ఆవరణంలోని సునయన వెనుక భాగమున ఉన్న మైదానంలో “మానవతా” స్వచ్ఛంద సేవా సంస్థ మరియు ఏపీ జెఎసి వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న క్రీడలలోకలెక్టరేట్ లోని వివిధ శాఖలలో విధులు నిర్వహించే దాదాపు 150 మంది మహిళలు టెన్నికాయిట్, మ్యూజికల్ చైర్, లెమన్ స్పూన్, షటిల్, త్రో బాల్, టగ్ ఆఫ్ ఫర్, షాట్ పుట్, షటిల్ తదితర క్రీడల్లో పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో సర్వజన ప్రభుత్వ వైద్యశాల ఏవో సింధు సుబ్రహ్మణ్యం,”మానవతా” స్వచ్ఛంద సేవా సంస్థ కన్వీనర్ యాని ప్రతాప్, ప్రెసిడెంట్ దీప, ఏపీ జెఎసి అమరావతి ఉమెన్ వింగ్ చైర్ పర్సన్ శ్రీమతి సహారాబాను, జనరల్ సెక్రెటరీ శ్రీమతి సి పద్మావతి, ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సరస్వతి,కలెక్టరేట్ లోని వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న మహిళలు తదితరులు పాల్గొన్నారు.
