ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించిన వైసీపీ నాయకులు…
1 min read

ఆలూరు న్యూస్ నేడు : ఆలూరు మండల కేంద్రంలో వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం నందు ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి ని ఘనంగా సన్మానించిన జిల్లా బీసీ సెల్ కార్యదర్శి భాస్కర్ నాయుడు, తాలూకా క్రిస్టియన్స్ అధ్యక్షులు జాన్, ఆలూరు మండల రైతు విభాగం అధ్యక్షులు వెంకటేష్, మండల బూత్ కమిటీ అధ్యక్షులు రవి కుమార్, మండల విద్యార్థి విభాగ అధ్యక్షులు విజయ్ కృష్ణ(సాయి ) ప్రత్యేకంగా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మరియు ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా ఉపాధ్యక్షులు,జిల్లా కార్యవర్గ సభ్యులు,తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివిఆర్ అభిమానులు పాల్గొన్నారు.


